ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చీపుర్లు, రోకళ్లతో సిద్ధంగా ఉండండి

ABN, Publish Date - Oct 02 , 2024 | 06:24 AM

‘‘పక్క వాళ్ల ఇళ్లు కూలగొడుతున్నరు మనకేంది.. వాళ్లతో పంచాయతీ ఉందని మీరు అనుకోవద్దు. ఇయ్యాల వాళ్ల వంతు.. రేపు అదే బుల్డోజర్‌ మీ వద్దకు వస్తుంది. నలుగురు బ్రోకర్‌ గాళ్లను పంపి మిమ్మల్ని ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తరు. మన ప్రాంతానికి బుల్డోజర్లు

చాకలి ఐలమ్మ, రాణిరుద్రమ మీకు స్ఫూర్తి

మనకేంది అనుకుంటే.. మొదటికే మోసం

మూసీ సుందరీకరణపై మేమూ దృష్టి పెట్టాం

పేదలకు ఇబ్బంది అని కేసీఆర్‌ వద్దన్నారు

హైకోర్టు మందలించినా సిగ్గు, లజ్జ లేదు

‘ బాధితులకు బీఆర్‌ఎస్‌ భరోసా’లో కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/గోల్నాక/హైదరాబాద్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘పక్క వాళ్ల ఇళ్లు కూలగొడుతున్నరు మనకేంది.. వాళ్లతో పంచాయతీ ఉందని మీరు అనుకోవద్దు. ఇయ్యాల వాళ్ల వంతు.. రేపు అదే బుల్డోజర్‌ మీ వద్దకు వస్తుంది. నలుగురు బ్రోకర్‌ గాళ్లను పంపి మిమ్మల్ని ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తరు. మన ప్రాంతానికి బుల్డోజర్లు వస్తున్నయంటే అందరూ ఒక్కటి కావాలి. యంత్రాలు, అధికారులను అడుగు పెట్టనీయొద్దు. మన ఇళ్ల మీదకు వస్తున్నారంటే.. ఒక్కో మహిళ చీపుర్లు, రోకళ్లు చేతబట్టాలి. చాకలి ఐలమ్మ, రాణిరుద్రమల్లా పోరాడాలి’’ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌ అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాక తులసిరాంనగర్‌(లంక)లో జరిగిన ‘మూసీ బాధితులకు బీఆర్‌ఎస్‌ భరోసా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానికులతో మాట్లాడి వారి బాధలు తెలుసున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం పేదలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషం లేకుండా చేస్తోందని మండిపడ్డారు. పేదల ఇళ్లు కూలగొట్టి రూ.1.50 లక్షల కోట్లతో మాల్‌, హోటల్‌ కడతాముంటున్నారని, దీంతో ఎవరికి లాభమనిని ప్రశ్నించారు. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో వస్తారని, అందరూ వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకొని.. ఒక్క మెసేజ్‌తో అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. మూసీ సుందరీకరణ చేయాలని తమ ప్రభుత్వ హయాంలోనూ భావించామని, 28 వేల పేదల ఇళ్లు తొలగించాల్సి వస్తుందంటే.. కేసీఆర్‌ సూచనతో ప్రాజెక్టును పక్కన పెట్టామని కేటీఆర్‌ తెలిపారు. రేవంత్‌రెడ్డి మాత్రం రూ.1.50 లక్షల కోట్లతో పేదలను ఆగం చేసే ప్రాజెక్టు చేపడుతున్నారని ఆరోపించారు. తాము రూ.16 వేల కోట్లతో ప్రతిపాదించిన ప్రాజెక్టు పది రెట్లు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. మార్క్‌ చేసిన ఇళ్లపై ఆర్‌బీ ఎక్స్‌ అని రాస్తున్నారు.. వాటిని చెరిపేసి కేసీఆర్‌ అని రాయండి.. ఎవడు వచ్చి టచ్‌ చేస్తడో చూస్తామన్నారు. నిన్ననే హైకోర్టు ప్రభుత్వాన్ని, హైడ్రాను మందలించింది అయినా రేవంత్‌కు సిగ్గు, లజ్జా లేకుండా మలక్‌పేట నియోజకవర్గంలో కూల్చివేతలు ప్రారంభించారని విమర్శించారు. మీకు కష్టం వస్తే ఎమ్మెల్యే వచ్చాడు.. మీ ఓట్లతో గెలిచిన ఎంపీ ఎక్కడ అని సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్‌ ప్రశ్నించారు. పేదలను ఆగం చేసేందుకు రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి ఒక్కటయ్యారని, అందుకే ఇక్కడి ఎంపీ మాట్లాడడం లేదన్నారు.


ఫిరాయింపులపై రెండు మాటలా?

‘పార్టీ ఫిరాయింపులపై హిమాచల్‌లో నీతులు చెబుతారు. తెలంగాణలో గోతులు తవ్వుతారు? యూపీలో బుల్డోజర్‌రాజ్‌ తప్పంటారు. హైదరరాబాద్‌లో మీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తుంటే ఒప్పంటారు..! ఇదేం నీతిమాలిన.. అవకాశవాద రాజకీయం రాహుల్‌ గాంధీజీ’ అంటూ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. మరోవైపు.. కేటీఆర్‌ వాహనంపై కాంగ్రెస్‌ వర్గం దాడి చేయడం సరికాదని మాజీ మంత్రులు, హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి తదితరులు ఖండించారు.

Updated Date - Oct 02 , 2024 | 06:24 AM