ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad- ఉద్యోగ భద్రత కరువు

ABN, Publish Date - Oct 01 , 2024 | 10:31 PM

వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలకు ఉద్యో గ భద్రత కరువైంది. రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు ప్రతిపాదికన పని చేస్తున్నా తమను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వ హిస్తున్నా వేతనాల్లోనూ తేడా ఉందని, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.

ఆందోళన చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలు(ఫైల్‌)

- దశాబ్దాలుగా వెట్టి చాకిరి

- రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు

- వేతనాల్లోనూ తేడాతో అవస్థలు

- ప్రభుత్వం కనికరించాలని వినతి

వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంలకు ఉద్యో గ భద్రత కరువైంది. రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు ప్రతిపాదికన పని చేస్తున్నా తమను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వ హిస్తున్నా వేతనాల్లోనూ తేడా ఉందని, నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 1: వైద్య ఆరోగ్యశాఖలో రెండు దశా బ్దాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంల పరిస్థితి అధ్వానంగా మారింది. చాలీచాలని వేతనాలతో జీవితాన్ని నెట్టుకొస్తూ ఉద్యోగ భద్రత కోసం ఎదురు చూస్తున్నారు. దశల వారీగా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాల్సి ఉండగా పట్టించుకునే వారు లేకపో వడంతో పని ఒత్తిడితో వెట్టిచాకిరి చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జాతీయ ఆరోగ్యమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆరో గ్య ఉపకేంద్రాలు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రెండో ఏఎన్‌ఎంలను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించారు. 2001, 2007, 2009లో వీరిని నియమించారు. 2001లో నియామకమైన కొందరిని రెగ్యులర్‌ చేశారు. మిగతా వారిని దశల వారీగా రెగ్యులర్‌ చేస్తామన్న ప్రభుత్వం అప్పటి నుంచి పట్టించుకోవడం లేదు. జిల్లా, రాష్ట్రస్థాయిలో నిరసనలు తెలుపు తున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదు.

- అసెంబ్లీ ఎన్నికల ముందు..

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నెలరోజుల పాటు ఉద్యోగ భద్రత కోసం సమ్మె చేశారు. ప్రభుత్వం సమ్మె కాలానికి వేతనం సై తం చెల్లించలేదు. ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీల నేతలు రెగ్యులర్‌ చేస్తామని ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 110 మంది రెండో ఏఎన్‌ఎంలు రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నాలుగు గ్రామాలు ఉంటే రెండు గ్రామాలు రెగ్యులర్‌ మరో రెండు గ్రామాల బాధ్యతలను కాంట్రాక్టు ఏఎన్‌ ఎంలకు కేటాయించారు. వీరి మధ్య వేతన వ్యత్యాసం మాత్రం చాలా ఉంది. నెలకు అందిస్తున్న రూ. 27వేలు వేతనం సరిపోవడంలేదని, ఏరియర్స్‌ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొ ఏఎన్‌ఎంను రెండు, మూడు గ్రా మాలలో వైద్య సేవలు అందించడానికి కేటాయించారు. కానీ రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలకు రవాణా కోసం ఎఫ్‌టీఏ బిల్లులు చెల్లించి కాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు చెల్లించడంలేదు. జిల్లాలో వ్యాక్సినేషన్‌ డబ్బాలు తరలించడానికి వ్యాక్సిన్‌ క్యారియర్‌ డబ్బులు సైతం ఇవ్వడంలేదని ఆరోపణలు ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖకు ఆన్‌లైన్‌లో వివరాలు పంపించడానికి, స్టేషనరికి సైతం బిల్లులు చెల్లించడంలేదని సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించడానికి సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి వైద్య సేవలు అందించిన చాలా మందికి వయసు పైబడుతుందని, ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రెండో ఏఎన్‌ఎంలు కోరుతున్నారు.

సర్వీసును బట్టి రెగ్యులర్‌ చేయాలి..

- వసంత, రెండో ఏఎన్‌ఎం, ఆసిఫాబాద్‌

సర్వీసును బట్టి రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలి. 20 ఏళ్లుగా నోటిఫికేషన్‌ లేదు. ప్రభుత్వం ఇటీవల కాలంలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెబుతోంది. దీంతో మేము సర్వీసును కోల్పోయే ప్రమాదం ఉంది. సర్వీసును పరిగణలోకి తీసుకుంటూనే ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

ఆందోళన చేసినా ఫలితం లేదు..

- సంతోషి, రెండో ఏఎన్‌ఎం, తిర్యాణి

ఉద్యోగ భద్రత కోసం ఆందోళన చేసినా ఫలితంలేదు. రెగ్యులర్‌ ఏఎ న్‌ఎంలతో సమానంగా మాకు రెండు, మూడు గ్రామాలు అదనంగా ఇచ్చి పని ఒత్తిడి పెంచుతున్నారు. కానీ వేతనాలు మాత్రం సమానం గా చెల్లించడంలేదు. సొంత ఖర్చులతో పక్క గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందించడానికి ఇబ్బందులు పడుతున్నాం.

Updated Date - Oct 01 , 2024 | 10:31 PM