ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Surekha: రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ విమర్శలు

ABN, Publish Date - Oct 08 , 2024 | 03:16 AM

దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన అక్కినేని కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారని సీనియర్‌ న్యాయవాది అశోక్‌రెడ్డి వాదించారు.

  • అక్కినేని కుటుంబంపై అభాండాలు వేశారు

  • పరువు నష్టం కేసులో నాగార్జున తరఫు న్యాయవాది వాదన

  • నేడు కోర్టులో నాగార్జున వాంగ్మూలం

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన అక్కినేని కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ విమర్శలు చేశారని సీనియర్‌ న్యాయవాది అశోక్‌రెడ్డి వాదించారు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేని అక్కినేని కుటుంబంపై తీవ్రమైన అభాండాలు వేశారన్నారు. సినీ హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ కోర్టులో సోమవారం వాదనలు పార్రంభమయ్యాయి. పిటిషనర్‌ నాగార్జున తరఫున న్యాయవాది అశోక్‌రెడ్డి వాదిస్తూ అక్కినేని కుటుంబంపై చేసిన దారుణ విమర్శలు చేసిన వారిపై భారత న్యాయ సంహితలోని సెక్షన్‌ 356 ప్రకారం కేసు నమోదుకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు.


పిటిషనర్‌ నాగార్జునతోపాటు సాక్ష్యులు స్వయంగా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు నాగార్జున, ఇతర సాక్ష్యులు తమ వాంగ్మూలం ఇవ్వడానికి మంగళవారం కోర్టుకు రానున్నారు. ఈ కేసు విషయమై టీపీసీసీ లీగ్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ తిరుపతి వర్మ కోర్టు బయట విలేకరులతో మాట్లాడుతూ ఘాటైన విమర్శలు చేశారు. ‘నాగార్జునతోపాటు ఆయన వెనకున్న వారిపైనా మేమూ కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తాం. కోర్టుకు నాగార్జున వస్తారో? ఎవరు వస్తారో రానివ్వండి. మంగళవారం విచారణ పూర్తయ్యాక మేము స్పందిస్తాం. ఒక రాజకీయ నాయకుడు నూలు దండను కొండా సురేఖ మెడలో వేయడంపై.. సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసినా స్పందించని వారు ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ తరఫున ఈ వ్యవహారంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Oct 08 , 2024 | 03:17 AM