ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చేపల లొల్లి!

ABN, Publish Date - May 27 , 2024 | 10:32 PM

కోట్‌పల్లి ప్రాజెక్టులో చేపలు పట్టే విషయంలో మత్స్యకార సంఘంలో వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కోట్‌పల్లి ప్రాజెక్టు మత్స్యకార సంఘం సభ్యులు ప్రాజెక్టులో చేపలు పెంచారు

కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద చేపలను పరిశీలిస్తున్న జిల్లా మత్య్సశాఖ అధికారి సౌజన్య

కోట్‌పల్లి ప్రాజెక్టులో చేపల పట్టే విషయంలో వివాదం

మత్స్యకార సంఘంలో రెండు వర్గాలుగా విడిపోయిన సభ్యులు

తమకు తెలియకుండా చేపలు పడుతున్నారని ఓ వర్గం ఆరోపణ

పోలీసులను ఆశ్రయించిన ఇరు వర్గాలు

విచారణ చేపట్టిన జిల్లా మత్య్సశాఖ అధికారి

ధారూరు, మే 27: కోట్‌పల్లి ప్రాజెక్టులో చేపలు పట్టే విషయంలో మత్స్యకార సంఘంలో వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కోట్‌పల్లి ప్రాజెక్టు మత్స్యకార సంఘం సభ్యులు ప్రాజెక్టులో చేపలు పెంచారు. ఈ చేపలను విక్రయించే విషయంలో చైర్మన్‌ ఆనంద్‌, మాజీ చైర్మనన బందయ్య వర్గాలుగా ఏర్పడటంతో వివాదం తలెత్తింది. అధికారుల త్రిసభ్య కమిటీకి, తమకు తెలియకుండా సంఘం చైర్మన్‌ ఆనంద్‌ వర్గం ఆదివారం రాత్రి కోట్‌పల్లి ప్రాజెక్టులో చేపలుపట్టి తరలిస్తున్నారనే సమాచారంతో మాజీ చైర్మన్‌ బందయ్య వర్గం వారిని అడ్డుకుని జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్యకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా మత్య్సశాఖ అధికారి సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రాజెక్టు వద్ద చేపల రవాణాకు తెచ్చిన ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. జిల్లా మత్య్సశాఖ అభివృద్ధి అధికారి సౌజన్య సోమవారం ప్రాజెక్టు వద్దకు వచ్చి చేపల వివాదంపై విచారణ జరిపారు. ప్రాజెక్టులో పట్టిన చేపలను సీజ్‌చేసి ఆమె తూకం వేయించారు. తూకం వేసిన చేపలను వేలం వేయాలా? మార్కెట్‌లో విక్రయించాలా? అనే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకోలేదు.

చేపల వివాదమిది

కోట్‌పల్లి ప్రాజెక్టులో చేపలు పట్టే విషయంలో కోట్‌పల్లిలో మత్య్సకార సంఘం చైర్మన్‌ ఆనంద్‌, మాజీ చైర్మన్‌ బందయ్యలు రెండు వర్గాలుగా విడిపోయారు. త్రిసభ్య కమిటీకి, తమకు తెలియకుండా చేపలుపట్టి తరలిస్తున్నారని ఆనంద్‌ వర్గంపై బందయ్య వర్గం జిల్లా మత్య్సశాఖ అధికారి సౌజన్యకు గతంలో ఫిర్యాదు చేశారు. ఈ షోకాజ్‌ నోటీసులను హైకోర్టులో సవాల్‌ చేసి ఆనంద్‌ వర్గం స్టే తెచ్చుకుంది. అధికారుల త్రిసభ్య కమిటీకి (తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎఫ్‌డీవో) తెలిపి చేపలను పట్టుకోవాల్సి ఉండగా, త్రిసభ్య కమిటీకి, సంఘంసభ్యులకు తెలపకుండా ఆనంద్‌ వర్గం చేపలు పట్టి తరలిస్తుండటంతో రెండు వర్గాల మధ్యం వివాదం నెలకొని పంచాయతీ అధికారులు, పోలీసుల వద్దకు చేరింది.

Updated Date - May 27 , 2024 | 10:32 PM

Advertising
Advertising