ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gachibowli Drugs Case: గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్స్.. పరారీలో ఆ ముగ్గురు

ABN, Publish Date - Feb 27 , 2024 | 06:35 PM

తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో (Radisson Hotel Drugs Case) తాజాగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. మాధాపూర్ డీసీపీ వినీత్ (DCP Vineeth) ఈ కేసు వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడిస్తూ.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. తాము డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను అదుపులోకి తీసుకున్నామని.. 10 సార్లు వివేకానందకు అతడు కొకైన్ (Cocaine) డెలివరీ చేశాడని తెలిపారు.

తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో (Radisson Hotel Drugs Case) తాజాగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. మాధాపూర్ డీసీపీ వినీత్ (DCP Vineeth) ఈ కేసు వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడిస్తూ.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. తాము డ్రగ్ పెడ్లర్ అబ్బాస్‌ను అదుపులోకి తీసుకున్నామని.. 10 సార్లు వివేకానందకు అతడు కొకైన్ (Cocaine) డెలివరీ చేశాడని తెలిపారు. ఆ హోటల్‌లో చాలాసార్లు పార్టీ చేసుకున్నట్లు నిందితులు తెలిపారని వెల్లడించారు. నిందితుల్లో వివేకానంద, కేదార్, నిర్భయ్ కొకైన్ సేవించినట్లు పరీక్షల్లో తేలిందని స్పష్టం చేశారు.


ఈ కేసులో ఇతర నిందితులైన లిషి, శ్వేత, సందీప్ పరారీలో ఉన్నారని.. చరణ్ బెంగళూరులో ఉన్నాడని చెప్పాడని డీసీపీ వినీత్ పేర్కొన్నారు. మిగిలిన వాళ్ళు డ్రగ్స్ సేవించారా? లేదా? అనేది పరీక్షలు చేసి నిర్ధారిస్తామన్నారు. అబ్బాస్ గతంలో మంజీర గ్రూప్‌లో పని చేశాడని, వివేకానంద ఆర్డర్ మేరకే అతడు కొకైన్ సప్లై చేశాడని వివరించారు. ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామని, రిమాండ్ రిపోర్ట్‌లో అన్ని విషయాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇద్దరు అమ్మాయిలు సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇక సినీ దర్శకుడు క్రిష్ (Director Krish) ఆ పార్టీలో పాల్గొన్నట్టు నిర్ధారణ కాలేదని, అయితే ఆయన విచారణకు వస్తానని చెప్పారని అన్నారు.

ఇదిలావుండగా.. ఈ కేసులో తన పేరు తెరమీదకు రావడంపై డైరెక్టర్ క్రిష్ ఇదివరకే స్పందించారు. తాను ఆ హోటల్‌కు వెళ్లిన మాట నిజమేనని, అయితే తాను కేవలం తన స్నేహితులను కలవడం కోసం మాత్రమే వెళ్లానని వివరణ ఇచ్చుకున్నారు. సాయంత్రం అరగంట పాటు హోటల్‌లో ఉండి.. 6:45 గంటలకు తాను ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. ఇదే విషయాన్ని తాను పోలీసులకు తెలియజేశానని, దీనిపై వాళ్లు ఒక స్టేట్‌మెంట్ అడిగారని క్రిష్ చెప్పుకొచ్చారు.

Updated Date - Feb 27 , 2024 | 06:35 PM

Advertising
Advertising