ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahabubabad : సీఎం అంకుల్‌.. ఇది నావంతు

ABN, Publish Date - Sep 04 , 2024 | 06:04 AM

వయసులో చిన్నదాన్నే కానీ తోటి మనుషులకు సాయం చేసే విషయంలో తన మనస్సు చాలా పెద్దదని నిరూపించింది మహబూబాబాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సింధు.

  • కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 3 వేలు అందజేసిన

  • మహబూబాబాద్‌కు చెందిన టెన్త్‌ విద్యార్థిని

మహబూబాబాద్‌ టౌన్‌, సెప్టెంబరు 3 : వయసులో చిన్నదాన్నే కానీ తోటి మనుషులకు సాయం చేసే విషయంలో తన మనస్సు చాలా పెద్దదని నిరూపించింది మహబూబాబాద్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సింధు. అమ్మానాన్న పాకెట్‌ మనీగా ఇచ్చిన డబ్బులో నుంచి కిడ్డీ బ్యాంకులో తాను భద్రంగా దాచుకున్న రూ.3వేలను సింధు వరద బాధితులకు సాయం చేసేందుకు ఇచ్చేసింది. మహబూబాబాద్‌కు చెందిన ముత్యాల గీతవాణి, ప్రవీణ్‌కుమార్‌ దంపతుల కుమార్తె సింధు స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కిడ్డీ బ్యాంకులో తాను పోగుచేసిన రూ.3 వేలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మంగళవారం స్వయంగా అందజేసిన సింధు.. వరద బాధితులకు సాయం చేసేందుకు వాటిని వినియోగించాలని కోరింది. సింధు చేసిన పనికి ముఖ్యమంత్రి ఆమెను అభినందించారు.

Updated Date - Sep 04 , 2024 | 06:05 AM

Advertising
Advertising