టూరిజం అభివృద్ధికి రూ.25 కోట్లు
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:42 PM
నల్లమల లో టూరిజం అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
-ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నల్లమల లో టూరిజం అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించేం దుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లమలలో ఉన్న టూరిజం ప్రాంతా లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్న నల్ల మల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రూ. 10 కోట్లతో మ ల్లెల తీర్థంలో కాటేజీలు రోప్‌వే వంటి పనులను చేపట్ట నున్నట్లు తెలిపారు. రూ.5 కోట్లతో వ్యూవ్ పాయింట్, రూ. 5 కోట్లతో అక్కమాదేవి గృహాల అభివృద్ధితో పాటు రెండు లాచ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 5 కోట్లతో డిండి ప్రాజెక్టు వద్ద అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామన్నారు. డిండి ప్రాజెక్టు అభివృద్ధి పనుల కోసం రూ. 5 కోట్లు కేటా యించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ నర్సయ్య యాదవ్, నాయకులు గోపాల్‌రెడ్డి, కట్టా అనంతరెడ్డి, రామనాంథం, రఘురాం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:42 PM