ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమగ్ర కుటుంబ సర్వేను వేగవంతం చేయాలి

ABN, Publish Date - Nov 07 , 2024 | 11:38 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని, పక్కాగా వివరాలు సేకరించాల ని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆదేశించారు.

- రాజాపూర్‌, నవాబ్‌పేట మండలాల్లో సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్‌

రాజాపూర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేను అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని, పక్కాగా వివరాలు సేకరించాల ని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆదేశించారు. గు రువారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సర్వేను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, ఎంపీడీవో మచ్చెందర్‌, ఉప తహసీల్దార్‌ భారతి, ఎన్యుమరేటర్లు తదిత రులు పాల్గొన్నారు.

ప్రతీ ఇంటిని సందర్శించాలి

నవాబ్‌పేట: గ్రామాలు, పట్టణాల్లో సమగ్ర ఇంటింటి సర్వేలో ఎన్యుమరేటర్లు ప్రతీ ఇంటిని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. గురువారం మండలంలోని ఇప్పటూర్‌, కారూర్‌ గ్రామాలను తహసీల్దార్‌ శ్రీని వాసులుతో కలిసి సందర్శించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికీ వార్డు కోడ్‌, బ్లాక్‌ తదితర కోడ్‌ నమోదు తర్వాత ఈనెల 9నుంచి సర్వే ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎన్యుమరేటర్‌ వద్ద ఉన్న స్టిక్కర్‌, మ్యాప్‌, ఐడీకా ర్డు, ఇతర ఫారాలను పరిశీలించారు. వివరాల సేకరణ కలెక్టర్‌కు ఎన్యుమరేటర్లు వివరించారు. కలెక్టర్‌ వెంట స్థానిక అధికారులు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 11:38 PM