బావిలో పడిపోయిన గుంటనక్క
ABN, Publish Date - Jun 02 , 2024 | 11:12 PM
వనపర్తి మండలం గుమ్మడం తండాలోని ఓ వ్యవసాయ పొలంలో ఆదివారం గుంట నక్క కనిపించింది. ఇటీవల నూతనంగా తవ్విన వ్యవసాయ బావిలో రెండు రోజుల ఆ నక్క పడిపోయింది.
గుమ్మడం తండాలో స్ప ృహ తప్పిన జంతువు
చికిత్స చేసి అడవిలో వదిలిన అటవీ అధికారులు
పెబ్బేరు రూరల్, జూన్ 2: వనపర్తి మండలం గుమ్మడం తండాలోని ఓ వ్యవసాయ పొలంలో ఆదివారం గుంట నక్క కనిపించింది. ఇటీవల నూతనంగా తవ్విన వ్యవసాయ బావిలో రెండు రోజుల ఆ నక్క పడిపోయింది. ఈ విషయాన్ని తండా వాసులు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ రాణి, జిల్లా స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్‌కు తెలిపారు. వారు అక్కడికి చేరుకొని నక్కను స్వాధీనం చేసుకున్నారు. వనపర్తి పశువైద్యశాలలో చికిత్స చేసి, వనపర్తి సమీపంలో తిరుమలయ్యగుట్ట అడవీ ప్రాంతంలో వదిలిపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో సందీప్ దేవేందర్, నాగశేషుసాయి పాల్గొన్నారు.
Updated Date - Jun 02 , 2024 | 11:12 PM