ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తరుగు పేరుతో మోసం చేస్తే చర్యలు

ABN, Publish Date - Nov 12 , 2024 | 11:50 PM

వరి కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో ఎ క్కువ తూకం వేసి రైతులను మోసం చేస్తే చ ర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.

వీపనగండ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

వీపనగండ్ల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : వరి కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో ఎ క్కువ తూకం వేసి రైతులను మోసం చేస్తే చ ర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మం గళవారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల ప రిధిలోని గోవర్థనగరి, వీపనగండ్ల, కల్వరాల, సం గినేనిపల్లి, పుల్గర్‌చర్ల గ్రామాలలో ఐకేపీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఆయన ప్రారంభించారు. పుల్గర్‌చర్ల గ్రా మ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతులు విక్రయించిన ధాన్యానికి కొనుగోలు కేంద్రాల్లోనే రశీదులు ఇవ్వాలని, ధా న్యం మిల్లులకు తరలించిన వెంటనే రైతుల ఖా తాలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలు కొనుగోలు చే సిన ధాన్యం రశీదుల ప్రకారం డబ్బులు చెల్లిం చాలని తరుగు పేరుతో మిల్లర్లు కోత విధిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుం టామన్నారు. నకిలీ విత్తన కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మంత్రి మండల వ్యవ సాయ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న కిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ను పోన్‌ ద్వారా మంత్రి ఆదేశించారు.

రుణమాఫీలో బ్యాంకర్లు నిర్లక్ష్యం విడాలని మంత్రి జూపల్లి అన్నారు. రుణమాఫీ డబ్బులు ఖాతాలో జమ చేయడంలేదని రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే స్థానిక ఐఓబీ బ్రాంచికి వెళ్లి రైతులను రుణ విముక్తి చేసేందుకు రు ణమాఫీ పథకం ప్రభుత్వం చేపట్టిందని, నిర్లక్ష్యం చేయడం తగదని మేనేజర్‌పై మండిపడ్డారు. 27 95 మంది ఖాతాలు పెండింగ్‌లో ఉండటం దా రుణమన్నారు. సాంకతిక కారణాలతో ఉన్న 1 100 ఖాతాల సమస్యను పరిష్కరిస్తామని, పది పదిహేను రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. డీఆ ర్డీవో ఉమాదేవి, ఏపీఎం బుచ్చన్న, గోదల బీ రయ్య, ఇంద్రకంటి వెంకటేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 11:50 PM