ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం తరలింపునకు చర్యలు

ABN, Publish Date - Dec 06 , 2024 | 11:24 PM

నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యాన్ని శుక్రవారం రైతులు ఎండకు ఆరబెట్టారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా వ్యాపారులతో మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్‌ లక్ష్మణ్‌లు సమీక్షించి మధ్యాహ్నం నుంచి కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు.

పేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు

- తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా వ్యాపారులతో చైర్మన్‌ సమీక్ష

- యార్డులో ఆరబెట్టి విక్రయించిన రైతాంగం

నారాయణపేట, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో తడిసిన ధాన్యాన్ని శుక్రవారం రైతులు ఎండకు ఆరబెట్టారు. ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా వ్యాపారులతో మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, కార్యదర్శి భారతి, సూపర్‌వైజర్‌ లక్ష్మణ్‌లు సమీక్షించి మధ్యాహ్నం నుంచి కొనుగోలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. కాస్త ఆలస్యంగా కాంటాలు ప్రారంభం కావడంతో కొంతమంది రైతులు తడిసిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈనెల నాలుగో తేదీన మధ్యాహ్నం ఆకస్మికంగా వర్షం కురి యడంతో అప్రమత్తమైన రైతులు తమ వరి కుప్పలపై టార్పాలిన్లు కప్పేలా చర్యలు తీసుకున్నా అడుగు భాగంలో తడిసిపోయాయి. శుక్రవారం టార్పాలిన్లు తొలగించి ఎండకు ఆరబెట్టేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. నిన్నటి వరి మాత్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోగా కంది విక్రయాలు యదావిధిగా కొన సాగాయి. రైతులకు సంబంధించి నాలుగు వేల బస్తాలు కొనుగోలు చేయగా వ్యాపారులకు సంబంధించి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ఐదు లారీల్లో 1500 బస్తాల ధాన్యం తరలించేలా వ్యాపారులు చర్యలు తీసుకున్నారు. ఇంకా షెడ్‌ల లో ధాన్యం నిల్వలు అధికంగా ఉండడంతో వాటి ని త్వరలో తరలించాలని వ్యాపారులకు మార్కెట్‌ పాలక, అధికార యంత్రాంగం సూచించింది.

నాలుగు మండలాల్లో వర్షపాతం నమోదు

జిల్లాలోని నాలుగు మండలాల్లో శుక్రవారం నమోదైన వర్షపాతాన్ని పరిశీలించినట్లయితే నారాయణపేట మండలంలో 44.8 మి.మీ., కొత్తపల్లి మండలంలో 15.5 మి.మీ., గుండుమాల్‌ మండ లంలో 11.8 మి.మీ., దామరగిద్ద మండలంలో 1.0 మి.మీ. వర్షపాతం న మోదు అయింది.

Updated Date - Dec 06 , 2024 | 11:24 PM