ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:16 PM

ప్రైవేట్‌ పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌, డీసీఈబీ కార్యదర్శి వెంకట్‌రాములు హెచ్చరించారు. ‘ఇష్టారీతిన ఎస్‌ఏ-1 పరీక్షలు’ అన్న శీర్షిక

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, అక్టోబరు 23: ప్రైవేట్‌ పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌, డీసీఈబీ కార్యదర్శి వెంకట్‌రాములు హెచ్చరించారు. ‘ఇష్టారీతిన ఎస్‌ఏ-1 పరీక్షలు’ అన్న శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై డీఈవో రవీందర్‌ స్పందించారు. ఎస్‌ఏ-1 పరీక్షలు సజావుగా జరుగుతున్నాయా? లేదా? అని ఏఎంవో, డీసీఈబీ సెక్రటరీతో పలు ప్రైవేట్‌ పాఠశాలల్లో తనిఖీలు చేయించారు. పలు స్కూల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలు నిర్వహించడంపై ఏఎంవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా పరీక్షల విభాగం రూపొందించిన ప్రశ్నపత్రాలతో, పాఠశాల విద్యాశాఖ టైం టేబుల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మరోమారు తప్పిదాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల పేరుతో ఫీజలు వసూలు చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్‌ స్కాలర్స్‌, యూనివర్సల్‌, పద్మాలయ, గీతం, రవీంద్ర భారతి పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించడంపై ఆయా యాజమాన్యాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 23 , 2024 | 11:16 PM