చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:27 PM
Along with studies, one should excel in sports
- డీఈవో అబ్దుల్ గని
నారాయణపేట రూరల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని డీఈవో అబ్దుల్ గని అన్నారు. మంగళవారం ఎస్‌జీఎఫ్ అండర్-14 విభాగంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు మండలంలోని జాజాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రా రంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో విద్యార్థులను పరిచయం చేసుకుని మాట్లాడారు. విద్యార్థులు గ్రామీణ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలకు క్రీడల్లో ఎదగాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం భారతి, డీఎస్‌వోహెచ్ భానుప్రకాశ్, డీవైఎస్‌వో వెంకటేష్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నర్సింహులు, సాయినాథ్, మణెమ్మ, రత్నయ్య, రమణ పాల్గొన్నారు.
జాజాపూర్ పాఠశాల తనిఖీ
మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. పదో తరగతి స్పెషల్ క్లాస్‌లు, వెనక బడిన విద్యార్థుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అందరూ ఉత్తీర్ణులయ్యేలా చూడాలని ఆదేశించారు.
విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఊట్కూర్: వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెం చాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని అన్నారు. మంగళవారం మండలంలోని నిడుగుర్తి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి విద్యా ర్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంత రం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పాఠశాల విద్యా ప్రగతికి తీసుకోవాల్సిన చర్య లపై చర్చించారు. పాఠశాలలో ప్రతి రోజు మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజ నం అందించాలన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 11:27 PM