బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:25 PM
ఈనెల 13 నుంచి ప్రారంభమయ్యే పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
- ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తాం
- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
-పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లు విడుదల
మక్తల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఈనెల 13 నుంచి ప్రారంభమయ్యే పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి, మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాలకు భక్తు లు పెద్ద సంఖ్యలో తరలివస్తారన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు తదితర ఏర్పా ట్లలో లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో వైద్య సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని, రద్దీని నియంత్రించేందుకు పో లీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు అ న్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని జాతర ఉత్సవాలకు ఆహ్వానిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, పేట డిపో మే నేజర్ లావణ్య, పుర కమిషనర్ భోగేశ్వర్లు, ఎంపీ డీవో రమేష్, బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, కట్టసురేష్ కుమార్, రవికుమార్, మల్లికార్జున్, రవికుమార్, ఆలయ ధర్మకర్త ప్రాణేష్‌చారి, అర్చకులు అర వింద్, శ్యామ్‌సుందర్‌చారి తదితరులున్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:25 PM