బోధనా సామర్థ్యాల పరిశీలన
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:24 PM
మండల పరిధిలోని జాజాపూర్ గ్రామ జడ్పీహెచ్‌ఎస్‌ను సోమవారం డీఈవో గోవిందరాజులు తనిఖీ చేశారు.
నారాయణపేట రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని జాజాపూర్ గ్రామ జడ్పీహెచ్‌ఎస్‌ను సోమవారం డీఈవో గోవిందరాజులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పదో తరగతిలో విద్యార్థుల బోధనా సామర్థ్యాలను పరిశీలించారు. పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు వారి చేత బోర్డుపై రాయించారు. అనంతరం బియ్యం నిల్వలను ఆయన పరిశీలించారు. డీఈవో వెంట సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, శ్రీనివాస్‌లు ఉన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:24 PM