ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెరుగైన విద్యే లక్ష్యం

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:01 AM

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించమే లక్ష్యమని రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నారు.

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వివరాల రిజిష్టర్‌ను పరిశీలిస్తున్న ఆకునూరి మురళి

- రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి

వెల్దండ/మన్ననూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించమే లక్ష్యమని రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల, ఎమ్మార్సీ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలను ఆకునూరి మురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలికల ఉన్నతపాఠశాలలో విద్యార్థుల ప్రార్థన సమయానికి చేరుకున్న చైర్మన్‌ ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థన చేశారు. ఆయా పాఠశాలలో విద్యార్థుల హాజరుశాతాన్ని, కావాల్సిన మౌలిక వసతుల గురించి అడిగితెలుసుకున్నారు. మధ్యాహ్నభోజనానికి వాడుతున్న బియ్యం, కూరగాయల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు, రావాల్సిన పెండింగ్‌ బిల్లులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా తనతో పాటు మరో ముగ్గురు కమిషన్‌ సభ్యులు జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను మెరుగైన విద్యాబోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నభోజన నిర్వాహకులకు బిల్లులు ఆలస్యంగా రావడం, యూనిట్‌ కాస్ట్‌ తక్కువగా ఉండటం గమనించామని తెలిపారు. ఎంఈవో చంద్రుడు ఉన్నారు. అలాగే, అమ్రాబాద్‌ మండలం మన్ననూరులోని ఆదివాసీ గురుకుల విద్యాలయం (పీటీజీ), ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలను రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకు నూ రి మురళి శుక్రవారం పరిశీలించారు. మొదట పీటీజీలోని వంట గదితో పాటు, అన్నం, సాంబారు, ఇతర వంటకాల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. గిరిజన సంక్షేమ ఉ న్నత పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Updated Date - Nov 30 , 2024 | 12:01 AM