ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సన్నరకానికి బోనస్‌

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:29 PM

సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ఇస్తా మని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

-వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి

పెద్దమందడి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సన్న రకం వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్‌ ఇస్తా మని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. మండలంలోని మోజర్ల, పెద్దమందడి, పామిరెడ్డిపల్లి గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేం ద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభు త్వం రైతన్నలను కంటికి రెప్పలా కాపాడుకుంటోం దన్నారు. వడ్లకు గిట్టుబాటు ధర ఏ గ్రేడ్‌కు క్వింటా లుకు రూ. 2320, బీ గ్రేడ్‌కు క్వింటాలుకు రూ. 2300 ఇస్తుందన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూ డాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కొత్తకాపు రామ కృష్ణారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ విష్ణు వర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి మొగిలి సత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:29 PM