సన్న వడ్లు క్వింటాలుకు బోనస్ రూ.500
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:36 PM
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభు త్వమని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తుందని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.
- కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి
బల్మూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభు త్వమని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తుందని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని తుమ్మన్‌పేట గ్రామంలోని పీఏసీఎస్ కొండ నాగులలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మా ట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఈవో రాజవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నర్సయ్యయాదవ్, వైస్‌చైర్మన్ కుర్మయ్య, వ్యవసాయశాఖ మండల అధికారి నరేష్, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Nov 05 , 2024 | 11:36 PM