ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైద్యసిబ్బంది అని బురిడీ

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:22 PM

వైద్యశాఖలో ఏఎన్‌ఎంల పోస్టుల విషయంలో ఉద్యోగిలిప్పిస్తానని మొత్తం రూ. 50 ఇవ్వాలని, అందులో మొదట రూ. 25వేలు చెల్లించాలని అభ్యర్ధులకు చెబుతున్న సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి బాధితులు, వైద్యసిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

- ఉద్యోగాల పేరుతో ఫోన్‌లో డబ్బులు డిమాండ్‌ చేస్తున్న గుర్తు తెలియని దుండగులు

- ఫిర్యాదు చేసిన వైద్యసిబ్బంది

గద్వాల క్రైం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): వైద్యశాఖలో ఏఎన్‌ఎంల పోస్టుల విషయంలో ఉద్యోగిలిప్పిస్తానని మొత్తం రూ. 50 ఇవ్వాలని, అందులో మొదట రూ. 25వేలు చెల్లించాలని అభ్యర్ధులకు చెబుతున్న సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి బాధితులు, వైద్యసిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నా పేరు ఆంజనేయులు అని, వైద్యశాఖలో విధులు నిర్వహిస్తున్నానని చెబుతూ... ‘‘అరుణ అనే యువతికి ఏఎన్‌ఎం పోస్టు రావాలంటే నాకు మొత్తం రూ. 50 వేలు ఇవ్వాలని, మొదట రూ. 25వేలు ఇచ్చి, తర్వాత ఉద్యోగం వచ్చాక మరో రూ. 25వేలు ఇవ్వాలని’’ ఫోన్‌లో అరుణ అన్న ఉత్తమ్‌కుమార్‌కు ఫోన్‌ వచ్చింది. అయితే ఇది ఫేక్‌ లేదా నిజమా అని అతడు వైద్యశాఖలో పనిచేస్తున్న తన మిత్రుడు కృపకు సమాచారం ఇచ్చాడు. అతను వెంటనే డీడీఎం(డిస్ట్రిక్ట్‌ డాటా మేనేజర్‌) రామాంజనేయులుకు సమాచారం ఇచ్చాడు. అయితే ఆంజనేయులు అనే వ్యక్తి చేసిన ఫోన్‌ నంబర్‌కు డీడీఎం ఫోన్‌ చేసి ఎవరు నీవు.. ఎక్కడ పనిచేస్తున్నావు అని గద్దించేసరికి నానా బూతులు తిట్టడం జరిగిందన్నారు. అయి తే ఇది ఫేక్‌ న్యూస్‌ అని గ్రహించి ఆయన పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. అలాగే సాయంత్రం కలెక్టరేట్‌లోని ఓ శాఖలో పనిచేసే ప్రకాష్‌ అనే వ్యక్తికి కూడా ఆంజనేయులు అనే పేరుతో అదే వ్యక్తి ఫోన్‌ చేసి మీకు ఉద్యోగం రావాలంటే వెంటనే నా ఖాతాలో రూ. 50 వేలు డబ్బులు వేయాలని కోరాడు. అయితే ప్రకాష్‌ వెం టనే ఈ విషయాన్ని డీడీయంకు తెలుపగా ఇదంతా ఒట్టి మోసం, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించి నట్లు డీడీఎం రామాంజనేయలు ‘ఆంధ్రజ్యోతి’తో తెలిపారు. ఫ ఈ విషయంపై పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఆంజనేయులకు సంబంధించిన ఫోన్‌ నంబర్‌ను ట్రేస్‌ చేస్తున్నామన్నారు. ఉద్యోగాలిప్పిస్తామని, డబ్బులు ఇవ్వండని ఎవరైనా అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు.

Updated Date - Oct 23 , 2024 | 11:22 PM