అయిజలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Nov 10 , 2024 | 11:01 PM
వ్యాపార పరంగా దినదినాభివృద్ది చెందుతున్న అయిజ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు.
అయిజ టౌన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : వ్యాపార పరంగా దినదినాభివృద్ది చెందుతున్న అయిజ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం అయిజలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తనూరు చౌరస్తా నుంచి ఉప్పల్ చౌరస్తా వరకు డివైడర్‌ను ఏర్పాటు చేసి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే పట్టణ సందరీకరణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అయిజ పట్టణానికి వచ్చిపోయే వారికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. వీటితో పాటు ఉత్తనూరు చౌరస్తా, అయిజ పెట్రోల్‌పంపు చౌరస్తా, మేడికొండ చౌరస్తా, సిటీపాడు చౌరస్తా, ఉప్పల చౌరస్తాలలో మునిసిపాలిటీని గుర్తించేలా ప్రత్యేక ఆర్చులు నిర్మించి, దేశ నాయకుల విగ్రహాలను ప్రతిష్టించి మినీ పార్కులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పట్టణాల సుందరీకరణకు అనేక నిధులు కేటాయిస్తున్నప్పటికీ అయిజ పట్టణ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండటం విడ్డూరమన్నాడు. అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ష, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భీమ్‌సేన్‌రావ్, ఓబీసీ అధికార ప్రతినిధి వెంకటేష్, నాయకులు ప్రదీప్‌స్వామీ, మహష్, జనార్దన్ పాల్గొన్నారు.
Updated Date - Nov 10 , 2024 | 11:01 PM