పౌరసరఫరాల శాఖ డీఎం ఇర్ఫాన్ రిలీవ్
ABN, Publish Date - Nov 07 , 2024 | 11:00 PM
పౌరసరఫరాల శాఖలో గత కొన్ని రోజలుగా అవినీతి ఆరోపణలు ఎదు ర్కొంటున్న డీఎం ఇర్ఫాన్‌ను రిలీవ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు.
- ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
వనపర్తి అర్బన్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : పౌరసరఫరాల శాఖలో గత కొన్ని రోజలుగా అవినీతి ఆరోపణలు ఎదు ర్కొంటున్న డీఎం ఇర్ఫాన్‌ను రిలీవ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ‘పౌరసరఫరాల శాఖలో దుమారం’ పేరిట కథనం రావడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అత న్ని రిలీవ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గ త ఏడు రోజుల క్రితం ఇర్ఫాన్‌ను మహబూబ్‌నగర్ డీఎంగా బదిలీ చేస్తూ పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిన వి షయం తెలిసిందే. అయితే బదిలీపై ఇర్ఫాన్ మహబూబ్‌నగర్ జి ల్లాకు వెళ్లకుండా ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ వచ్చారు. అత ని స్థానంలో నిజామాబాద్ జిల్లా నుంచి డీఎంగా పని చేస్తున్న వైపీ రమేష్ ఇక్కడికి బదిలీ కావడంతో అతన్ని బాధ్యతలు చేప ట్టకుండా పైరవీలు చేసి ఇర్ఫాన్ విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఈ విషయంపై జిల్లా రాజకీయాలతో పాటు అధికారుల్లో పెద్ద దుమా రం రేగింది. అతని అవినీతితో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఇ క్కడ విధులు నిర్వహిస్తుండటంతో ఆంఽధ్రజ్యోతిలో ఈ విషయమై వార్త ప్రచురితం అయింది. ఎట్టకేలకు రాష్ట్ర స్థాయి పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు విచారణ చేసి రిలీవ్ చేశారు.
Updated Date - Nov 07 , 2024 | 11:00 PM