ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించాలి

ABN, Publish Date - Sep 06 , 2024 | 11:45 PM

We should help to protect the environment: Collector BM Santhosh

మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి : కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, సెప్టెంబరు 6 : వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి తయారు చేసిన రెండు వేల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను సరస్సులు, చెరవుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితం అవుతాయన్నారు. చెరువులు, సరస్సుల్లో జీవ వైవిధ్యానికి నష్టం కలుగుతుందని తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలు నీటిలో సహజంగా కరిగిపోతాయని, పర్యావరణానికి హాని కలిగించవని చెప్పారు. పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. గద్వాలకు వెయ్యి, అయిజకు 500, అలంపూర్‌కు 250, వడ్డేపల్లి 250 విగ్రహాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నర్సింగరావు, శ్రీనివాసులు, ఏవో వీరభద్రప్ప, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌బాబు, డీఎం విమల, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 11:45 PM

Advertising
Advertising