ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పెండింగ్‌ ఫిర్యాదులపై కలెక్టర్‌ ఆరా

ABN, Publish Date - Nov 11 , 2024 | 11:19 PM

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలు విన్నవించుకున్న ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.

- జాప్యం చేయొద్దని ప్రజావాణిలో అధికారులకు ఆదేశాలు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలు విన్నవించుకున్న ఫిర్యా దులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సమీక్రుత జిల్లా కార్యాలయ సముదాయంలో సో మవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెండింగ్‌, పరిష్కారం చేసిన ఫిర్యాదులపై ఆరా తీశారు. పరిష్కారంలో జాప్యం చేయవద్దని ఆయా శాఖ ల అధికారులకు పలుసూచనలు చేశారు. కార్య క్రమంలో అదనపు కలెక్టర్‌లు శివేంద్ర ప్రతాప్‌, ఎస్‌. మోహన్‌రావు, జడ్పీ సీఈవో వెంకట్‌ రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు, అధికారులు పాల్గొన్నారు.

అబుల్‌ కలాం ఆజాద్‌కు ఘన నివాళి

స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబు ల్‌ కలాం ఆజాద్‌ విద్యారంగానికి చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్‌ అన్నారు. ఆయన జయం తిని పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడా రు. అబుల్‌ కలాం జయంతిని నవంబరు 11న మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శంకరాచారి ఉన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 11:19 PM