ప్రతీ పోలింగ్ బూత్‌లో ఓటర్ల జాబితా ప్రదర్శించాలి
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:30 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 సందర్భంగా ప్రతీ పోలింగ్ బూత్‌లో ఓటర్ల జాబితా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 సందర్భంగా ప్రతీ పోలింగ్ బూత్‌లో ఓటర్ల జాబితా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శని, ఆదివారాల్లో ని ర్వహించనున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ క్యాంపెయిన్‌ను ఓటర్లు సద్వినియోగం చేసుకోవా లని మర్రికుంటలోని 179, బండారు నగర్‌లోని 153, 155, 156, ఇందిరా నగర్‌లోని 117 పోలిం గ్ బూత్‌లను కలెక్టర్ సందర్శించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఓటరు జాబితాలో డబుల్ ఓట్లు ఉంటే వాటిని ఫారం 7 ద్వారా తొ లగించాలన్నారు. మార్పులు ఏమైనా ఉంటే ఫా రం 8 ద్వారా సరి చేసుకోవాలన్నారు. 2025 జన వరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఎవరై నా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలను కుంటే ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చ న్నారు. ఇందుకోసం బీఎల్‌వోలు ఇప్పుడు అందు బాటులో ఉంటారని ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. ఆర్డీవో సుబ్ర హ్మణ్యం, తహసీల్దార్ రమేష్ రెడ్డి, పూర్ణచందర్, బీఎల్‌వోలు, కలెక్టర్ వెంట ఉన్నారు.
Updated Date - Nov 09 , 2024 | 11:30 PM