ముగిసిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు
ABN, Publish Date - Nov 23 , 2024 | 11:14 PM
జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని హనుమాన్‌యూత్ అధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి.
నెలరోజుల్లో మినీ స్టేడియాన్ని వినియోగంలోకి తెస్తా : శాట్ చైర్మన్ శివసేనారెడ్డి
ఎర్రవల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని హనుమాన్‌యూత్ అధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞా, ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. పది రోజుల నుంచి కొనసాగుతున్న ఈ పోటీలలో 50 జట్లకు పైగా పాల్గొన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో గద్వాల జిల్లాకు చెందిన శివపురం గ్రామ నక్షత్ర లెవెన్ వర్సెస్ కర్నూలు జిల్లాకు చెందిన గూడురు శివ లెవెన్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీలలో గద్వాల జిల్లాకు చెందిన నక్షత్ర లెవెన్ జట్టు విన్నర్‌గా నిలిచింది. రన్నర్‌గా కర్నూలు జిల్లాకు చెందిన గూడురు శివ లెవెన్ జట్టు నిలిచింది. విన్నర్ జట్టుకు దాత ఎర్రవల్లి మాజీ సర్పంచ్ జోగుల రవి రూ. 80వేలు, రన్నర్ జట్టుకు అందించే రూ. 40 వేలను జోగుళాంబ ఆలయ ధర్మకర్త సరస్వతి విరాళం అందించారు. ఈ నగదును విన్నర్, రన్నర్ జట్లకు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అందించారు. బెస్ట్ బ్యాట్స్ మ్యాన్‌గా రాజోళికి చెందిన హనుమంతురెడ్డి, బెస్ట్ బౌలర్‌గా ఎర్రవల్లికి చెందిన శివకుమార్‌లు నిలిచారు. అంతకు ముందు శాట్ చైర్మన్ మినీ స్టేడియాన్ని డీవైఎస్‌వో ఆనంద్‌తో కలిసి పరీశీలించారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ఈ స్టేడియాన్ని సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లడి నెల రోజుల్లో వినియోగం లోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దీపక్ ప్రజ్ఞా, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షుడు రవి, మార్కెట్ చైర్మన్ దొడ్డెప్ప, వైస్ చైర్మన్ కుమార్, అలంపూర్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్, అడ్డాకుల రాము, డీసీసీ కార్యదర్శులు సిరాజ్, శ్యామ్ సుందర్, సంధ్యబాబు ఉన్నారు.
Updated Date - Nov 23 , 2024 | 11:14 PM