ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:28 PM
జడ్చర్ల మున్సిపాలి టీలో 671 ఇండ్లు, జడ్చర్ల మండలంలో 774 ఇండ్లలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు.
జడ్చర్ల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కు టుంబ సర్వే జడ్చర్ల మున్సిపాలిటీ, జడ్చర్ల మండ లంలో శనివారం ప్రారంభం అయ్యింది. ఎన్యుమ రేటర్‌లు ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యుల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. జడ్చర్ల మున్సిపాలి టీలో 671 ఇండ్లు, జడ్చర్ల మండలంలో 774 ఇండ్లలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. సర్వేను మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి పరిశీలిం చారు. జడ్చర్ల మండలం చిట్టబోయిన్‌పల్లిలో సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ మోహన్‌రావు పరిశీ లించారు. తప్పులకు తావివ్వొద్దని ఆదేశించారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, జడ్చర్ల మండలంలో ఎంపీడీవో విజయ్‌కుమార్ పరిశీలించారు.
Updated Date - Nov 09 , 2024 | 11:28 PM