ప్రభుత్వ సహకారంతో సదర్ ఉత్సవాల నిర ్వహణ
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:03 PM
జిల్లా కేంద్రంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరి స్తుందని యాదవులంతా కలిసికట్టుగా ఈ ఉత్స వాలు జరుపుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.
- సన్నాహక సదస్సులో వక్తలు
నారాయణపేట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తిగా సహకరి స్తుందని యాదవులంతా కలిసికట్టుగా ఈ ఉత్స వాలు జరుపుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిటిజన్ క్లబ్ ఆవరణలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో సదర్ సన్నాహక సదస్సు జరిగింది. సద స్సుకు ఎమ్మెల్యే ప్రతినిధిగా, విశిష్ట అతిథిగా డీసీ సీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రతినిధులుగా ఆర్డీవో రాంచందర్, డీఎస్పీ లింగయ్య, డీపీఆర్‌వో రషీద్, డీవైఎఫ్‌వో వెంకటేష్, అతిథులుగా యాదవ మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువీర్‌యాదవ్, సత్యయా దవ్, శశికాంత్‌యాదవ్, బాలప్పయాదవ్, తిరు పతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం విరాళం అందించిన శివకుమార్‌రెడ్డి మిగతా సభ్యులచే విరాళాలు ప్రకటింపజేసి ప్రోత్సహించారు. ఉత్సవాలు ఈనెల చివరి వారంలో అందరి సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన కోరారు.
Updated Date - Nov 09 , 2024 | 11:03 PM