చేనులోనే పత్తి
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:29 PM
వ్యవసాయంలో ప్రధాన భూమిక పోషించేది కూలీలే. సాగు ముందుకు సాగాలంటే కూలీల పాత్ర కీలకంగా మారింది.
- కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతులు
- పంటలన్నీ ఒకే సారి దిగుబడి రావడంతో లేబర్‌కు పెరిగిన డిమాండ్
- రూ.400 నుంచి రూ.600 ఇచ్చినా కొరతే
- ఇతర ప్రాంతాలకు వెళ్లినా దొరకని కూలీలు
- పంట పొలంలోనే నల్లబారుతున్న తెల్లబంగారం
అచ్చంపేట/అమ్రాబాద్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో ప్రధాన భూమిక పోషించేది కూలీలే. సాగు ముందుకు సాగాలంటే కూలీల పాత్ర కీలకంగా మారింది. విత్తనాలు వేసే నాటి నుంచి పంట ఇంటికి చేరేదాకా కూలీలు ఉండాల్సిందే.. ఆధునిక కాలంలో వ్య వసాయంలో రైతుకు అందుబాటులోకి ఎన్నో పరికరాలు వచ్చాయి. కానీ పత్తి, మిర్చి సాగుచేసిన రైతులకు మాత్రం ఎలాంటి పరికరాలు అందుబాటులో లేకపోవ డంతో కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. నాగర్ కర్నూల్ జిల్లాలో పత్తి పంట 2,11,449 ఎకరాల్లో సాగు చేశారు. ఒక ఎకరాకు పంట పూర్తి కాలం నాటికి ఎకరాకు సుమారు 30 నుంచి 40 మంది కూలీలు అవ సరం ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే రైతులకు కూలీలు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పత్తిపంట ఒకేసారి చేతికి రావడంతో స్థాని కంగా ఉన్న కూలీలకు డిమాండ్ పెరిగింది. రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు పోను రోజుకు రూ.400 నుంచి 600 వరకు డిమాండ్ చేస్తున్నారు. అయినా స్థానికంగా కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు కూలీల కోసం పక్క జిల్లాలకు వెళ్తున్నారు. అక్కడ కూడా అదే డిమాండ్ చేయడం, కూలీలు దొరకకపోవడంతో పత్తి చేనులోనే మగ్గుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. చేసేది లేక కూలీ అధికంగా చెల్లించి తీసుకు వస్తున్నారు. దీంతో ఖర్చులు పెరగడంతో పెట్టుబడి కూడా వెళ్తుందో లేదో అని పత్తిసాగు చేసిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కిలోల చొప్పున తీసున్న కూలీలు
రోజు వారి కూలీ కాకుండా వ్యవసాయ పనులు సకా లంలో పూర్తి కావాలని, కిలో పత్తి తీస్తే రూ.13 నుంచి రూ.15 వరకు చెల్లిస్తూ కొందరు రైతులు సకాలంలో పనులు పూర్తి కావాలని పత్తి పంటను తీయిస్తున్నారు. ఈ క్రమంలో ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల దిగుబడి వస్తే కూలీలకే రూ.15 వేలు చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
Updated Date - Nov 11 , 2024 | 11:29 PM