ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బార్డర్‌ దాటుతోంది..

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:12 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగుచేసిన పత్తి బార్డర్‌ దాటుతోం ది. గద్వాలలో ఇప్పటి వరకు సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించలేదు.

పత్తి లోడ్‌తో రాయిచూర్‌ వెళ్తున్న బొలేరో వాహనం

- సెస్‌ చెల్లించకుండానే పత్తిని రాయిచూర్‌ తరలిస్తున్న వ్యాపారులు

- చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు

- ఆదాయం కోల్పోతున్న మార్కెట్‌

- నేటికీ కొనుగోళ్లు ప్రారంభించని సీసీఐ

గద్వాల, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగుచేసిన పత్తి బార్డర్‌ దాటుతోం ది. గద్వాలలో ఇప్పటి వరకు సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో దళారులు ఇక్క డ కొనుగోలు చేసిన పత్తికి సెస్‌ చెల్లించకుండా కర్ణా టక రాష్ట్రంలోని రాయిచూర్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్‌ అధికారులు బార్డర్‌ దా టుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై ఒక శాతం సెస్‌ వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ పత్తిలోడుతో బార్డర్‌ దాటుతున్న ఒక్కో వాహనానికి రూ.1000 తీసుకొని వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గద్వాల వ్యవసాయ మార్కెట్‌ ఆదాయం కోల్పోతున్నది. జిల్లాలో నందిన్నె, బల్గెర వద్ద అంత ర్రాష్ట్ర చెక్‌ పోస్టులు ఉన్నప్పటికీ అధికారులు సెస్‌ వసూలు చేయలేకపోతున్నారు. ప్రతీ రోజు పదుల సంఖ్యలో పత్తిలోడ్‌తో బొలేరో వాహనాలు బార్డర్‌ దాటుతున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా సెస్‌ వసూలు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సోమవారం మాత్రం మార్కెట్‌ కార్యదర్శి బార్డర్‌లో తనిఖీ చేయడంతో రూ.25వేల ఆదాయం వచ్చింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 1,20,597ఎకరాలలో పత్తి సాగు చేశారు. ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అంటే దాదాపు 12లక్షల క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

సెస్‌లు వసూలు చేయాలని చెప్పాం

బార్డర్‌ దాటుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై ఒకశాతం సెస్‌ వసూలు చేయాలి. మార్కెట్‌ సెక్రటరీ సోమవారం చెక్‌పోస్టు వద్దకు వెళ్లారు. సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం. త్వరలోనే సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తాం.

- పుష్పమ్మ, మార్కెటింగ్‌ అధికారి గద్వాల

Updated Date - Oct 23 , 2024 | 11:12 PM