పాలమూరు బిడ్డ రేవంత్‌తో అభివృద్ధి
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:39 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాను లక్ష కోట్లతో అభివృద్ధి చేసేం దుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి టౌన్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పాలమూరు జిల్లాను లక్ష కోట్లతో అభివృద్ధి చేసేం దుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి పట్ట ణంలోని తన నివాసంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుపండుగ సభ విజ యవంతం చేసినందుకు నిర్వాహకుల కు, సభకు వచ్చిన రైతులకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు ముద్దుబిడ్డ కావడంతో సీఎం ప్రసంగా న్ని వినడానికి రైతులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో తరలిరా వడం సంతోషంగా ఉందన్నారు. రైతు పండుగ సభలో ఉమ్మడి జిల్లా అభి వృద్ధి కోసం లక్ష కోట్లు కేటాయించా లని సీఎం మంత్రులను కోరడం ఉమ్మ డి పాలమూరు ప్రజల అదృష్టమ న్నా రు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంతటి సహాసం చేయలేదని, సీఎం ఈ ప్రాం తవాసీ కావడంతో మన జిల్లా సాగు నీటితో సస్యశ్యామలం కాబోతోందని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని స్వాగతించాల్సి న ప్రతిపక్షాలు మాత్రం పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని వి మర్శించారు.
కేసీఆర్ వలసల జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశాడ ని, పాలమూరు- రంగారెడ్డి ప్రా జెక్టు ను పూర్తి చేయకుండా వివక్ష చూపిం చాడని మండిపడ్డారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదయ్య, కృష్ణ, బాబా, రాగివేణు, వెంకటేష్, జానంపేట నాగరాజు ఉన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:39 PM