చేనేత అభయహస్తంతో అభివృద్ధి
ABN, Publish Date - Dec 06 , 2024 | 11:37 PM
తె లంగాణ ప్రభుత్వం చేప ట్టనున్న చేనేత అభయ హస్తం ద్వారా చేనేత కార్మికులకు అనేక సంక్షే మ పథకాలు అందను న్నాయని, జోగుళాంబ గద్వాల జిల్లా చేనేత, జౌళీశాఖ ఏడీ గోవింద య్య అన్నారు.
- ఏడీ గోవిందయ్య ఫ చేనేత విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయుడు
- ఏడీ గోవిందయ్య ఆధ్వర్యంలో సీనియర్ చేనేత కార్మికులకు సన్మానం
రాజోలి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : తె లంగాణ ప్రభుత్వం చేప ట్టనున్న చేనేత అభయ హస్తం ద్వారా చేనేత కార్మికులకు అనేక సంక్షే మ పథకాలు అందను న్నాయని, జోగుళాంబ గద్వాల జిల్లా చేనేత, జౌళీశాఖ ఏడీ గోవింద య్య అన్నారు. శుక్రవా రం రాజోలిలోని రైతు వేదికలో రాజోలి చేనేత సహకార సంఘం ఇన్ చార్జి అధ్యక్షుడు డి.శ్రీ నివాసులు ఆధ్వర్యంలో చే నేత విజయోత్సవాల కార్యక్రమం నిర్వహించి ఆయన కార్మికులతో మాట్లాడారు. ముందుగా ఉదయం రాజోలిలో చేనేత సహ కార సంఘం నుంచి చేనేత కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరై తెలంగాణ-1 రేసింగ్ జెండా ను ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించి, అ క్కడ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఏడీ గోవిందయ్య మాట్లాడుతూ... చేనేత కా ర్మికులు విజయోత్సవ శుభాకాంక్షలు తె లిపారు. పలు సమస్యలను పరిష్కరించి, ఆదుకో వాలని కార్మికులు ఏడీకి వినతి పత్రం అందజే శారు. చేనేత జౌళీశాఖ ఏడీవో ఉపేంద్ర, క్లస్టర్ సీడీ ఈలు శివకుమార్, శివశంకర్, చేనేత సహకా ర సంఘం ఇన్‌చార్జి అధ్యక్షుడు దోత్రె శ్రీనివాసు లు, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యులు నిషాక్, నాయకు లు వంక మహేష్, హసన్, మాబు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
Updated Date - Dec 06 , 2024 | 11:37 PM