డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:16 PM
మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ సం ఘం నాయకులు ధర్నా నిర్వహించారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ సంఘం నాయకుల ధర్నా
మక్తల్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ సం ఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మద్దిలేటి, వెంకటేష్‌లు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 70 మంది రోగులు ఉన్నారన్నారు. డయాలసిస్ చేసుకునేందుకు నారాయణపేట, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. వారంలో రెండు, మూడు రోజులు డయాలసిస్ కేంద్రాలకు వెళ్లి వచ్చేందుకు బాధితులు ఇబ్బంది పడుతున్నారన్నారు. మక్తల్ పట్టణంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే రోగులకు అనువుగా ఉంటుందన్నారు. నియోజకవర్గంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయకపోతే ఈనెల 15 నుంచి రిలే దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ సతీష్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పోలప్ప, రామకృష్ణ, రవికుమార్, కుమ్మరి కిష్టప్ప, ఎండీ.ఖ లీం, తేజవర్దన్, రాకేష్, జగ్గలి రమేష్, జుట్ల రాం చందర్, కర్రెం సురేష్, శ్రీనివాస్, కురుమయ్యలు పాల్గొన్నారు.
Updated Date - Nov 06 , 2024 | 11:16 PM