మునిసిపల్ అధికారులపై కౌన్సిల్ సభ్యుల అసంతృప్తి
ABN, Publish Date - Sep 06 , 2024 | 11:46 PM
వన పర్తి మునిసిపల్ అధికారుల తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
- హైదరాబాద్‌లో డీఎంఏకు ఫిర్యాదు
- పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం.. కమిషనర్ సరెండర్ అంశం ప్రస్తావన
వనపర్తి టౌన్, సెప్టెంబరు 6: వన పర్తి మునిసిపల్ అధికారుల తీరుపై అధికార పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పా టించడం లేదని, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తూ మునిసిపాలి టీకి రావాల్సిన ఆదాయం సమకూర్చు కోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని కౌన్సిల్ సభ్యులు గుర్రుగా ఉన్నారు. రెవెన్యూ విభాగం, టౌన్ ప్లానింగ్ అ ధికారుల పనితీరుతో మునిసిపాలి టీకి ఆదాయం ఆశించినంత మేర జమకావడం లేదనేదే కౌన్సిల్ సభ్యుల వాదన. ఫలితంగా అధికారుల తీరుపై మునిసిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణతో పాలు పలువురు కౌన్సిలర్లు శుక్రవారం హైదరాబాద్‌లోని డీఎం ఏను కలిసి ఫిర్యాదుచేశారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
సరెండర్ అంశం ప్రస్తావన
వనపర్తి మునిసిపల్ సాధారణ సమావేశం గురువారం చైర్మన్ పుట్ట పాకల మహేష్ ఆధ్వర్యంలో నిర్వ హించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కమిషనర్ పూర్ణచందర్ పనితీరుపై మెజారిటీ కౌన్సిల్ సభ్యు లు అభ్యంతరం వ్యక్తం చేయగా, వైస్ చైర్మన్ పాకనాటికృష్ణ సరెండర్ చే యాలని తీర్మానం ప్రవేశపెట్టగా స భ్యులు ఆమోదించారు. అనంతరం అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా శుక్ర వారం డీఎంఏను కలిశారు. కార్యక్ర మంలో వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, కౌన్సిలర్లు బాపనిపల్లి వెంకటేష్, నక్క రాములు, సత్యంసాగర్, ఎల్‌ఐసీ కృష్ణ, గంధం శరవంద తదితరులు ఉన్నారు.
Updated Date - Sep 06 , 2024 | 11:46 PM