ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం వద్దు

ABN, Publish Date - Apr 22 , 2024 | 11:36 PM

తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని జడ్పీ సీఈవో కాంతమ్మ అధికారులను ఆదేశించారు.

సమీక్ష నిర్వహిస్తున్న జడ్పీ సీఈవో కాంతమ్మ, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ

- స్థాయీ సంఘ సమావేశంలో జడ్పీ సీఈవో కాంతమ్మ

గద్వాల, ఏప్రిల్‌ 22 : తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని జడ్పీ సీఈవో కాంతమ్మ అధికారులను ఆదేశించారు. వేసవి ముగిసే వరకు తాగుని నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, స్ర్తీ శిశు సంక్షేమంపై సోమవారం నిర్వహించిన స్థాయీ సంఘాల సమా వేశంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మతో కలిసి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయంపై నిర్వహించిన సమీక్షలో డీఏవో గోవిందనాయక్‌ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయం సక్రమంగా సాగలేదని వివరించారు. ఈ ఏడాది వర్షాలు అనుకున్నస్థాయిలో కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నందున, అందుకు తగినట్లుగా విత్తనాలు, ఎరువుల ఇండెం ట్‌ను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. పండ్లతోటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జడ్పీ సీఈవో ఆయనకు సూచించారు. చిన్న సన్నకారు రైతులకు అందులోని ప్రయోజనాలను వివరించి ఆ వైపు దృష్టి సారించేలా చూడాలని సూచించారు. అనంతరం తాగునీటిపై అధికారులు వివరణ ఇస్తుం డగా, అంతరాయం లేకుండా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పీడబ్ల్యూఎస్‌ పథకాలను బాగు చేయించడంపై దృష్టి పెట్టాల న్నారు. 10వ విడత హరితహారానికి నర్సరీలను సిద్ధం చేశామని డీఆర్‌డీఏ అధికారులు తెలుపగా, మొక్కలు నాటడంతో పాటు సంరక్షణపై దృష్టి సారించాలని సీఈవో సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు, ఎంత మేర బతికి ఉన్నాయనే వివరాలు కావాలన్నారు. అనం తరం స్ర్తీ శిశు సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికల విధులు ఉండటంతో వ్యవసాయ శాఖ అధికారి తప్ప మిగిలినవారందరు కార్యాలయ సిబ్బంది సమావేశానికి హాజరు కావడంతో పూర్తి స్థాయి సమీక్ష సాధ్యం కాలేదు.

Updated Date - Apr 22 , 2024 | 11:37 PM

Advertising
Advertising