పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు అవకాశమివ్వొద్దు
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:14 PM
పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
- ఊట్కూర్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం తనిఖీ
ఊట్కూర్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం ఊట్కూర్ మండల కేం ద్ర సమీపంలోని విజయ కాటన్ ఇండస్ట్రీస్ వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేం ద్రాన్ని ఆమె తనిఖీ చేసి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రైతుల వద్ద పత్తి కొనుగోలు జరగాలని అన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రంలో అమ్మని రైతులకు ప్రైవేలు కొనుగోలులో కూడా నష్టం జరగకుండా చూడాలన్నారు. అంతకుముందు మిల్లులో రైతులతో మాట్లాడి ధర, విక్రయ పద్ధతిని అడిగి తెలుసు కున్నారు. మిల్లులో ప్రవేశం మొదలు తేమ శా తం పరీక్ష పరిశీలన, తూకం, విక్రయం ధర, రైతుల వేలిముద్రతో కూడిన ఆధార్ అను సంధానం, ఓటీపీ విధానాన్ని కంప్యూటర్‌లో ప్ర త్యక్షంగా పరిశీలించారు. అనంతరం అధికారుల తో మాట్లాడి రైతులకు ఎన్ని రోజుల్లో డబ్బులు ఖాతాల్లో జమ అవుతున్నాయని అడిగి తెలుసు కున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్, సీసీఐ అధికారి ఆకుల అవినాష్, ఏవో గణేష్‌రెడ్డి, వివిధ గ్రామాల రైతులు ఉన్నారు.
Updated Date - Nov 05 , 2024 | 11:14 PM