ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ABN, Publish Date - Dec 06 , 2024 | 11:22 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, ఎప్పటికప్పుడు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వికారాబాద్‌ కలెక్టర్‌, నారాయణపేట ఇన్‌చార్జి కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు.

కొమ్మూరులో వరి తేమ శాతాన్ని పరిశీలిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

- వికారాబాద్‌ కలెక్టర్‌, నారాయణపేట ఇన్‌చార్జి కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌

- కొమ్మూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ

కోస్గి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, ఎప్పటికప్పుడు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వికారాబాద్‌ కలెక్టర్‌, నారాయణపేట ఇన్‌చార్జి కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని చెన్నారంలో ఐకేపీ, గుండుమాల్‌ మండలం కొమ్మూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యం కేంద్రానికి తీసుకు వచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు. ధాన్యం తెచ్చిన వెంటనే కొంటున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రైతులతో మాట్లాడారు. ధాన్యం వర్షానికి తడిసినా ఎండబెట్టి తీసుకువస్తే ప్రభుత్వం కొంటుందన్నారు. పండిన పంట చివరి గింజ దాకా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. ఎవరు అధైర్యపడొద్దని అన్నారు. ధాన్యం కుప్పల వద్దకు వెళ్లి తేమ శాతాన్ని పరిశీలించారు. సన్న వడ్లకు బోనస్‌ పడుతుందా అని అధికారులతో ఆరా తీశారు. ఆర్డీవో రామచందర్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం దేవరాజ్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్‌, కోస్గి, గుండుమాల్‌ తహసీల్దార్లు శ్రీనివాసులు, భాస్కర్‌ తదితరులున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 11:22 PM