ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆడపిల్లలను నిర్లక్ష్యం చేయొద్దు

ABN, Publish Date - Dec 07 , 2024 | 11:19 PM

ఆడపిల్లలు అంటే అన్నం పెట్టేవాళ్లని, వాళ్లను నిర్లక్ష్యం చేయవద్దని, బాగా చదివించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- తల్లిదండ్రులకు సూచించిన ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఆడపిల్లలు అంటే అన్నం పెట్టేవాళ్లని, వాళ్లను నిర్లక్ష్యం చేయవద్దని, బాగా చదివించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారని అన్నారు. భవిష్యతు బాగుండాలంటే ఇప్పుడు కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని విద్యార్థులను కోరారు. శనివారం బాలికల జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రెండేళ్లు కష్టపడి చదివితే జీవితం అంతా బాగుంటుందని, తల్లిదండ్రులు వారి భవిష్యత్తుకు తోడ్పాటు అందించాలని, పిల్లల చదువు పట్ల శ్రద్ధ వహించడాన్ని బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య అందుబాటులో ఉందని, ఇక్కడ ఇంజనీరింగ్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌ కోసం శిక్షణ పొందిన వాళ్లు సంవత్సరం వంద మంది ఉన్నారని, వచ్చే సంవత్సరం 200 విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా పాలమూరు యూనివర్సిటీలోనే లా, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఆల్‌ మదీనా కళాశాలలో కూడా ఒక మైనార్టీ ఇంజనీరింగ్‌ కళాశాల తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీకేరెడ్డి కాలనీలో సొంత నిధులతో ఫస్ట్‌ పేరిట స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నామని గర్తు చేశారు. అంతకుముందు ఎంవీఎస్‌ కళాశాలలో సమీకృత విద్యా భవనానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కౌసర్‌ జహాన్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహ్మరెడ్డి, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి పాల్గొన్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : మండలంలోని కోడూరు గ్రామంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జమిస్తాపూర్‌ గ్రామంలో రూ.20 లక్షలతో ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌, రూ.ఐదు లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అంబులెన్స్‌ను ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్‌ఎస్‌ నాయకుడు గౌతం శ్రీనివాసులుతో పాటు పలువురు పార్టీలో చేశారు. ఓబులాయపల్లిలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మల్లు నర్సింహరెడ్డి, కాంగ్రెస్‌ మండల నాయకులు ధర్మాపూర్‌ నర్సింహరెడ్డి, రవీందర్‌, ముడా లక్ష్మణ్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ అనిత, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌ కుమార్‌, డీసీసీ కార్యదర్శి సిరాజ్‌ ఖాద్రీ, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణ, ఎంపీడీవో కరుణశ్రీ పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 11:19 PM