రైతులకుఇబ్బంది కలిగించొద్దు
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:43 PM
ధాన్యం కొనుగోలు కేంద్రా లలో ‘అన్నదాతల పడిగాపులు’ అనే శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్ర చురితమైన కథనానికి కలెక్టర్ ఆదర్శ్ సు రభి స్పందించారు.
వనపర్తి అర్బన్, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రా లలో ‘అన్నదాతల పడిగాపులు’ అనే శీర్షికన మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్ర చురితమైన కథనానికి కలెక్టర్ ఆదర్శ్ సు రభి స్పందించారు. మంగళవారం గోపా ల్‌పేట మండలంలోని చెన్నూరు, వనప ర్తి మండలంలోని చిమనగుంటపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేం ద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగ కుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం క్లీనింగ్ విషయంలో రైతులకు అవగాహ న కల్పించాలన్నారు. ఒక కేంద్రంలో ఒకే రకమైన ధాన్యాన్ని కొను గోలు చేయాల ని, దొడ్డు, సన్నాలు ఒకే దగ్గర కొనుగోలు చేయడానికి అనుమతిం చేది లేదని తెలి పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే నగదు చెల్లింపు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అ నంతరం చిట్యాల శివారులో ఉన్న గోదా ములను పరిశీలించారు. ధాన్యం నిలువ చేయడానికి ఎంత మేర ఖాళీ స్థలం ఉందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నా రు. ఆయన వెంట సివిల్ సప్లయ్ అధికా రి కాశీ విశ్వనాథ్, వనపర్తి తహసీల్దార్ రమేష్‌రెడ్డి, గోపాల్‌పేట తహసీల్దార్ తిల క్‌రెడ్డి, ఎంపీడీవో తదితరులు ఉన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 11:43 PM