పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
ABN, Publish Date - Nov 06 , 2024 | 12:06 AM
స్వ చ్ఛ ఆత్మకూరుగా ఏర్పాటు చేసేందుకు పెద్దలు, పిల్లలు భాగస్వాములు కావాలని ఆత్మకూరు మునిసిపల్ కమిషనర్ శశిధర్ పేర్కొన్నారు.
ఆత్మకూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : స్వ చ్ఛ ఆత్మకూరుగా ఏర్పాటు చేసేందుకు పెద్దలు, పిల్లలు భాగస్వాములు కావాలని ఆత్మకూరు మునిసిపల్ కమిషనర్ శశిధర్ పేర్కొన్నారు. స్వ చ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ ఆత్మకూరులో భాగంగా చై ర్‌పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్‌తో కలిసి మంగళవారం ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులతో స మావేశమయ్యారు. విద్యార్థులు పర్యావరణ పరి రక్షణ నిమిత్తం ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయ కుండా వాటి నుంచి గృహోపకరణ వస్తువులు ఎ లా తయారు చేయాలో వంటి అంశాలపై అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలికల పాఠశాల, శ్రీవాణి పాఠశాల విద్యార్థు లు ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన గృహోప కార వస్తువులను పరిశీలించారు. ప్లాస్టిక్ వ్యర్థాల ను వృథాగా పడేయటంతో పర్యావరణం కలుషి తమవడమే కాకుండా భూగర్భ జలాలు ఇంకిపో యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఈ మధ్యకాలంలో వీధి కుక్కల సంతతి అధికమైంద ని కుక్కలకు దూరంగా ఉండడం మంచిదని తెలిపారు. మండల విద్యాధికారి బాలరాజు, ఉ పాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Nov 06 , 2024 | 12:07 AM