ఉత్సాహంగా పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
ABN, Publish Date - Nov 03 , 2024 | 10:56 PM
సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే పోలీస్, ప్రెస్‌కి మధ్య రాబోయే రోజుల్లో సత్సంబంధాలు ఉండేందుకు ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు.
- విజేతగా నిలిచిన పోలీస్ జట్టు
నారాయణపేట టౌన్, నవంబరు 3 (ఆంధ్ర జ్యోతి): సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే పోలీస్, ప్రెస్‌కి మధ్య రాబోయే రోజుల్లో సత్సంబంధాలు ఉండేందుకు ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఆదివారం పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ప్రెస్ టీం 16 ఓవర్లలో 97 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ తీసుకున్న పోలీస్ టీం 14 ఓవర్ల నాలుగు బాల్స్‌లో ఎనిమిది వికెట్లు కోల్పోయి ప్రెస్ జట్టుపై విజయం సాధించారు. క్రికెట్ టోర్నీలో ఎస్పీ యోగేష్‌గౌతమ్ స్వయంగా బ్యాటింగ్, బౌలింగ్ వేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం విజేత జట్టుకు, రన్నరప్ జట్టుకు బహుమతులను అందించి అభినందించారు. అడిషనల్ ఎస్పీ రియాజ్, డీఎస్పీ లింగయ్య, డీపీఆర్‌వో రశీద్, ఆర్‌ఐ నర్సింహ, ఎస్సైలు రాజు, భాగ్యలక్ష్మీరెడ్డి, వెంకటేశ్వర్లు, రాముడు, నవీద్, వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్సై శివశంకర్‌తో పాటు టీయూడబ్లూజే, ఐజేయూ జిల్లా అధ్య క్షుడు నారాయణరెడ్డి, డిజిటల్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘుగణప, మధుకర్, సంజీవప్రకాష్, ముజాయిద్ సిద్దిఖీ, నక్క శ్రీనివాస్, శ్రీధర్, పీఆర్‌వో వెంకట్‌తో పాటు జిల్లాలోని పోలీస్, ప్రెస్ బృందం సభ్యులు పాల్గొ న్నారు. టోర్నీలో స్కోరర్‌లుగా ఫిజికల్ డైరెక్టర్లు కతలప్ప, మౌలాలి, శ్రీధర్‌గౌడ్, ఎంపైర్‌లుగా టక్ అంబదాస్, రమేష్, కామెంట్రీగా సులిగెం సురేష్‌లు వ్యవహరించారు.
Updated Date - Nov 03 , 2024 | 10:57 PM