ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వంటగది ఆధారంగానే కుటుంబం నిర్ధారణ

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:27 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే బుధవారం జోగుళాం బ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ప్రారంభమైంది. తొలిరోజు కుటుంబాలను గు ర్తించి ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు.

గద్వాల పట్టణంలో సర్వే అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- ప్రారంభమైన ఇంటింటి సర్వే

- పరిశీలించిన కలెక్టర్‌, ఆదనపు కలెక్టర్‌

గద్వాల/వనపర్తి రాజీవ్‌చౌరస్తా నవంబరు 6 (ఆంధ్రజోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే బుధవారం జోగుళాం బ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ప్రారంభమైంది. తొలిరోజు కుటుంబాలను గు ర్తించి ఇళ్లకు స్టిక్కర్లు అతికించారు. మరో రెండు రోజుల పాటు బ్లాకులలో కుటుంబాల జాబితా ను సిద్ధం చేసి ప్రతీ ఇంటికి సమాచార స్టిక్కర్‌ ను అతికించే కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సర్వేలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల వివరాలు సేకరిస్తున్నారు. గద్వాల జిల్లాలో 7,49,098 మంది జనాభా ఉండగా 255 గ్రామ పంచాయతీలు 331 ఆవాసాలు, నా లుగు మునిసిపాలిటీలలో సర్వేను ప్రారంభించారు. మొత్తం 1,126 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో పాల్గొన్నారు. గద్వాల పట్టణంలోని నల్లకుంట, వీవర్స్‌ కాలనీ, వడ్ల వీధి, అదేవిదంగా ధరూర్‌ మండల కేం ద్రంలోని బీసీ కాలనీల లో నిర్వహిస్తున్న సర్వే ను కలెక్టర్‌ బీఎం సం తోష్‌, అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణలు పరిశీలించారు. ఇంట్లోని వం టగది ఆధారంగానే కు టుంబాన్ని నిర్ధారించాలని కలెక్టర్‌ సూచించా రు. ఖాళీగా ఉన్న గృహాలకు వేకెంట్‌ స్టిక్కర్లు వేయాలని సూచించారు. పొరపాట్లకు తావివ్వొద్దని సూచించారు. అయిజ పట్టణంలో సర్వేను అదనపు కలెక్టర్‌ నర్సింగరావు పరిశీలించారు. మల్దకల్‌ మండలంలో నిర్వహిస్తున్న సర్వేను డీపీవో శ్యామ్‌సుందర్‌ పరిశీలించారు. వనపర్తి జిల్లాలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మద నాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాల్లో ని పలు గ్రామాలలో సర్వే తీరును పరిశీలిం చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని మరికల్‌లో మండల ప్రత్యేక అధికారి, డీఈవో గోవిందరాజులు తహసీల్దార్‌ రామకృష్ణయ్య, ఎంపీడీవో లక్ష్మీదేవితో కలిసి కుటుంబ సర్వేను ప్రారంభించారు. తొమ్మిదో తేదీ నుంచి సమగ్ర కుటుంబ సర్వే పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. మునిసిపాలిటీలలో కమిషనర్లు, మండలాల్లో ఆయా మండల పరిషత్‌ అధికారులు, ఎంపీవోలు సర్వేను పర్యవేక్షించారు. మొదటి రోజు కావడంతో సర్వే నెమ్మదిగా సాగింది.

Updated Date - Nov 06 , 2024 | 11:27 PM