మాజీ మంత్రి మహేంద్రనాథ్ సేవలు మరువలేనివి
ABN, Publish Date - Jul 17 , 2024 | 11:10 PM
మాజీ మంత్రి మహేంద్రనాథ్ సేవలు మరువలేనివని ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట టౌన్, జూలై 17 : మాజీ మంత్రి మహేంద్రనాథ్ సేవలు మరువలేనివని ఎమ్మె ల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మాజీ మంత్రి మహేంద్రనాథ్ 19వ వర్థంతి సందర్భంగా బుధ వారం పట్టణంలోని ఆయన విగ్రహానికి పలు పార్టీల నాయ కులు పూలమాల వేసి నివాళు లు అర్పించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి కోసం మహేంద్రనాథ్ అనేక విధాలుగా కృషి చేశారని, ఆయన ఆశయసాధన కోసం ప్రతీ ఒక్కరు శ్రమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ గార్లపా టి శ్రీనివాసులు, నాయకులు రాజేందర్, రవి, రామనాథం తదితరులున్నారు.
Updated Date - Jul 17 , 2024 | 11:10 PM