కాట్రేవుపల్లి నుంచి రిజిస్ర్టార్ దాకా..
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:23 PM
పాలమూ రు యూనివర్సిటీ రిజిస్ర్టార్‌గా ప్రొఫెసర్ చెన్నప్ప గురువారం బాధ్యతలు చేపట్టారు. వీసీ ప్రొఫెసర్ జీన్ శ్రీనివాస్ సమక్షంలో ఇన్‌చార్జి రిజిస్ర్టార్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి నుంచి ఏడో రిజిస్ర్టార్‌గా బాధ్యతలు చేపట్టారు.
పీయూ రిజిస్ర్టార్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ చెన్నప్ప
పాలమూరు యూనివర్సిటీ, నవంబరు 14 (ఆధ్రజ్యోతి): పాలమూ రు యూనివర్సిటీ రిజిస్ర్టార్‌గా ప్రొఫెసర్ చెన్నప్ప గురువారం బాధ్యతలు చేపట్టారు. వీసీ ప్రొఫెసర్ జీన్ శ్రీనివాస్ సమక్షంలో ఇన్‌చార్జి రిజిస్ర్టార్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి నుంచి ఏడో రిజిస్ర్టార్‌గా బాధ్యతలు చేపట్టారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామానికి చెందిన చెన్నప్పది వ్యవసాయ కుటుంబం. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, రిజిస్ర్టార్ వరకు ఎదిగారు. మొదటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివిన ఆయన అందరికంటే ముందుండేవారు. ఆయన పర్యవేక్షణలో రెండు ఎంఫిల్, 14 పీహెచ్‌డీలు లభించాయి. 2012-14లో రీసెర్చ్ అవార్డు, 2019లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, 2020లో ఐపీఏ బెస్ట్ కామర్స్ ఫ్యాకల్టీ, 2022లో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అవార్డులను అందుకున్నారు.
సొంత జిల్లాకు రావడం సంతోషంగా ఉంది
సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు యూనివర్సిటీకి రిజిస్ట్రార్‌గా వచ్చి, సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని రిజిస్ర్టార్ చెన్నప్ప అన్నారు. అధ్యాపకులు బాధ్యతతో కష్టపడి పని చేయాలని, ఉద్యోగులు సమయ పాలన పాటించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, ఉపాధి కోర్సులతో ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. స్టూడెంట్స్ బాగా చదివి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు.
Updated Date - Nov 14 , 2024 | 11:23 PM