ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యుద్ధం చెర నుంచి ఇంటికి..

ABN, Publish Date - Sep 13 , 2024 | 11:24 PM

వారంతా పొట్టకూటి కోసం దుబాయ్‌ వెళ్లారు. అక్కడ ఏ జెంట్‌ మోసం చేయడంతో అప్పటికే జరుగుతున్న ఉక్రెయి న్‌, రష్యా యుద్ధంలో ప్రైవేటు సైన్యానికి తరలించబడ్డాడు.

- దుబాయ్‌లో ఏజెంట్‌ మోసం

- బలవంతంతగా ఉక్రెయిన్‌, రష్యా యుద్ధభూమికి తరలింపు

- అతికష్టం మీద ఇంటికి చేరుకున్న పేట వాసి సూఫియాన్‌

నారాయణపేట,సెప్టెంబరు 13: వారంతా పొట్టకూటి కోసం దుబాయ్‌ వెళ్లారు. అక్కడ ఏ జెంట్‌ మోసం చేయడంతో అప్పటికే జరుగుతున్న ఉక్రెయి న్‌, రష్యా యుద్ధంలో ప్రైవేటు సైన్యానికి తరలించబడ్డాడు. గతే డాది నవంబరు 16న ఉక్రెయి న్‌- రష్యా బార్డర్‌కు చేరుకొన్న వీరు అప్పటి నుంచి రష్యా సైని కులకు సహాయకు లుగా పనిచే స్తూ యుద్ధభూమిలో బిక్కుబి క్కుమంటూ గడుపుతున్నారు. ఇలా అక్కడ చాలామంది భార తీయులు ఇరుక్కుపోయిన వారి కి విముక్తి లభించింది. అందు లో నారాయణపేటకు జిల్లా కేంద్రానికి చెందిన సూఫియాన్‌ ఒకరు కాగా అతడితో పాటే కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన ఇలియాస్‌, సమీర్‌అహ్మద్‌, నయిమ్‌షేక్‌లు శుక్ర వారం స్వగ్రామాలకు చేరుకున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన జహీర్‌, సినీమా దంపతుల రెండవ కుమారుడు సయ్యద్‌ మహ్మద్‌ సూఫియాన్‌ ఇంటర్‌ వర కు చదువుకున్నాడు. 2021లో పొట్టకూటి కోసం దుబాయి వెళ్లాడు. అక్కడ హోటల్‌లో పనికి కుదరగా నెలకు రూ.30వేల వరకు వచ్చేవి. ఈ క్రమంలో అతడికి బాబ అనే వ్యక్తి పరిచయమై దుబాయిలో రూ.30 వేలే వస్తాయని రష్యాలో లక్ష వరకు ఇప్పిస్తాన ని అందుకోసం రూ.3లక్షలు చెల్లించాల్సిందిగా సూఫియాన్‌కు చెప్పాడు. ఎక్కువ జీతం వస్తుందని ఆశపడ్డ సూఫియాన్‌ తల్లిదండ్రులకు విషయం తెలపడంతో వారు అప్పు చేసి రూ.3లక్షలు పంపారు. వాటిని సూఫియాన్‌ బాబకు అందజేయగా అతడు 2023 నవంబర్‌లో రష్యాకు పంపించాడు. మొదట సెక్యూరిటీ పోస్టులో జాబ్‌ అని చెప్పి తర్వాత ప్రైవేటు సైన్యంలో సహాయకులుగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలపగా వారు చేయని ప్రయత్నం లేదు. రష్యాలోని భారత రా యబార కార్యాలయంతో పాటు తెలిసిన అధికారులను కలిసి విన్నవించారు. నారాయ ణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కూడా కుటుంబ సభ్యుల వద్ద వివరాలు తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా కేంద్రానికి లేఖ రాశారు. ఇలా భారత్‌ నుంచి అక్కడ ఇరు క్కుపోయిన వారి విషయంలో ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమో దీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో జరిగిన సమావేశంలో చర్చించారు. అందుకు పుతిన్‌ కూడా సానుకూలంగా స్పందించారు. సూఫియాన్‌తో పాటు ఆ దేశంలో ఇరు క్కుపోయిన మిగతా భారతీయులు కూడా విడుదల అయ్యారు. తొమ్మిది నేలలుగా యుద్ధభూమిలో ఇబ్బందులు పడుతూ రోజుకు ఓసారి భోజనం చేస్తూ తుపాకీ చేత పట్టుకొని బిక్కుబిక్కుమంటు జీవనం కొనసాగించామని సూపియాన్‌ తల్లిదండ్రులు, బంధువుల ముందు వాపోయాడు. తమబాధను గుర్తించి ప్రధాని నరేంద్రమోదీ రష్యాతో మాట్లాడారని దాంతో విముక్తి లభించిందని పేర్కొన్నాడు. మీడియా, ప్రజా ప్రతినిధుల కృషితో తాను ప్రాణాలతో ఈరోజు నారాయణపేకు చేరుకొని తల్లిదండ్రుల ను కలిశానని కంటతడి పెట్టారు. ఆరో తేదీన మాస్కోకు చేరుకున్నామని, అక్కడ్నుంచి ఈనెల 12నరాత్రి ఢిల్లీకి చేరుకొని ముగ్గురు కర్ణాటకలోని గుల్బర్గాకు, ఒకరు కలకత్తాకు, ఒకరు కశ్మీర్‌కు వెళ్లగా తాను హైదరాబాద్‌కు శుక్రవారం వచ్చి నారాయణపేటకు రాత్రి తొమ్మిది గంటలకు చేరుకిని తల్లిదండ్రులతో మాట్లాడి ఇంటికి చేరుకున్నానని తెలిపా రు. నారాయణపేటలోని ఇంటికి చేరుకోన్న సూఫియాన్‌తో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఫోన్‌లో మాట్లాడి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.

Updated Date - Sep 13 , 2024 | 11:24 PM

Advertising
Advertising