క్రీడలతో భవిష్యత్
ABN, Publish Date - Nov 03 , 2024 | 10:55 PM
క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత పీఈటీ గోపాలం అన్నారు.
- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, విశ్రాంత పీఈటీ గోపాలం అన్నారు. ఆదివారం మక్తల్ మినీ స్టేడియంలో 48 మంది క్రీడాకారులకు దుస్తులు, సైకిళ్లు, హెల్మెట్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈనెల 4 నుంచి 6 వరకు జనగామ జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి రోడ్‌స్పీడ్ 20 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీల్లో 48 మంది బాలబాలికలు పాల్గొనడం సంతోషకరమన్నారు. మక్తల్‌లో వందలాది మంది క్రీడాకారులను వివి ధ క్రీడల్లో తయారుచేస్తూ స్వంత ఖర్చులతో దుస్తులు అందిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న రిటైర్డ్ పీఈటీ గోపాలంను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ప్రజల్లో అవగాహన కల్పించేం దుకు పురవీధుల గుండా సైక్లింగ్ ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి వాకిటి లలిత, పీడీలు మీనాకుమారి, రూప, సౌమ్య, స్వరూప, రేణుక, దామోదర్, రమేష్, కాంగ్రెస్ నాయకులు కోళ్ల వెంకటేష్, రాము తదితరులున్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
మక్తల్ పురపాలిక పరిధిలోని కొత్తగార్లపల్లి లక్ష్మప్పకు ఆదివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రూ.46,500ల చెక్కును అందించారు. అలాగే మండలంలోని జౌలాపురం గ్రామానికి చెందిన చిన్న హన్మంతుకు సీఎం సహాయనిధి చెక్కు అందించారు. కార్యక్రమంలో బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Nov 03 , 2024 | 10:55 PM