ప్రభుత్వ మద్దతు ధర పొందాలి
ABN, Publish Date - Oct 30 , 2024 | 11:21 PM
రైతులు సాగుచేసిన పత్తిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని పేట వ్యవసాయ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి అన్నారు.
- మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి
- లింగంపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
నారాయణపేట రూరల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రైతులు సాగుచేసిన పత్తిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని పేట వ్యవసాయ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లింగంపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని విక్రయిస్తే నష్టపోకుండా ఉంటారన్నారు. పత్తిని తేమ శాతం ప్రకారం తీసుకువచ్చి తగిన ధర పొందాలన్నారు. మార్కెట్ వైస్ చైర్మన్ కోణంగేరి హన్మంతు, డైరెక్టర్లు, మార్కెట్ యార్డు కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
దామరగిద్ద/నారాయణపేట రూరల్ : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మా త్రమే విక్రయించుకొని మద్దతు ధర పొందాలని దామరగిద్ద విండో చైర్మన్ పుట్టి ఈదప్ప అన్నారు. బుధవారం మండల పరిధిలోని క్యాతన్‌పల్లి, వ త్తుగుండ్ల గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించిందన్నారు. రైతులు ధా న్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శరణ్‌నాయక్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శేఖర్, ఏఈవో గోపాల్, లాలప్ప, లవకు మార్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా, పేట మండలం సింగారం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం వరి కొనుగోలు కేంద్రాన్ని విండో చైర్మన్ కొంకల్ నర్సింహారెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మార్కెట్ చైర్మ న్ సదాశివారెడ్డి హాజరై, మాట్లాడారు. వరి ఏ-గ్రేడ్ రకానికి రూ.2320, సాధారణ రకానికి రూ.2300లు ప్రభుత్వం ధర నిర్ణయించిందన్నారు. కార్యక్రమం లో ఏఎంసీ వైస్ చైర్మన్ కోణంగేరి హన్మంతు, సెక్రటరీ పి.అశోక్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Oct 30 , 2024 | 11:21 PM