మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Nov 20 , 2024 | 10:48 PM
మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు,
- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
- నర్వలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
నర్వ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు, బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. రాబోయే కాలంలో మహిళలను అన్నివిధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కొత్తకోట సిద్దార్థరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, మక్తల్ మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీఎం చంద్రశేఖర్, మహిళా సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 10:48 PM