ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోవిందా.. గోవింద

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:52 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం లోని కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్స వాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాలోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు.

కురుమూర్తి కొండల నడుమనున్న జాతర మైదానంలో భక్తుల సందడి

- అంగరంగ వైభవంగా ఉద్దాలోత్సవం

- భక్తసంద్రమైన కురుమూర్తి జాతర మైదానం

- స్వామి నామస్మరణతో మారుమోగిన కొండలు

- దర్శించుకున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు

చిన్నచింతకుంట, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం లోని కురుమూర్తి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్స వాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాలోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు. ఉత్సవంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తుల వాహనాలతో రహదారులు నిండిపోయాయి. తెల్లవారు జాము నుంచే భక్తుల రాక ప్రారంభం కావ డంతో జాతర మైదానం కిక్కిరిసి పోయింది. గోవింద నామస్మరణతో కురుమూర్తి గురులు మారుమోగాయి. భక్తులు దాసంగాలను సిద్ధం చేసుకొని స్వామి వారికి సమర్పించారు.

పల్లమర్రి నుంచి చాట ఊరేగింపు

స్వామి వారి పాదుకలను తీసుకెళ్లేందుకు వినియోగించే చాటను చిన్నచింతకుంట మండలంలోని పల్లమర్రి గ్రామంలో సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు గ్రామస్థులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి చాటకు ప్రత్యేక పూజలు చేశారు. చాటను తలపై పెట్టుకొని ముందు నడువగా, ఊరేగింపు ప్రారంభమైంది. గ్రామంలోని అన్ని ఆలయాలకు చాటను తీసుకెళ్లి పూజలు చేశారు. అనంతరం 11 గంటల సమయంలో ఉద్దాల చాటను ట్రాక్టర్‌పైన ఉంచి లాల్‌కోట, నెల్లికొండి, పెద్దవడ్డెమాన్‌ మీదుగా చిన్నవడ్డెమాన్‌ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్థులు, వేలాది మంది మంది భక్తులు చాట ఊరేగింపునకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఉద్దాల తయారీ మండపంలోకి చాటను తీసుకెళ్లగా, ఆనవాయితీ ప్రకారం దళితులు ఉద్దాలను చాటలో ఉంచి పూజలు చేశారు. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో ఉద్దాలను చాటను తయారీ కేంద్రం నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడే ఉన్న కట్టపై ఉంచారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యేలు సీతాదయాకర్‌రెడ్డి, ఆమె కుమారులు సిద్ధార్థరెడ్డి, కార్తీక్‌ రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, ఉద్దాలను దర్శించుకున్నారు. ఆ తర్వాత ఉద్దాల ఊరేగింపు ప్రారంభమై ఊకచెట్టు వాగు వద్దకు చేరుకున్నది. ఉద్దాలను దర్శించుకునేందుకు వచ్చిన వేలాదిమంది భక్తులు వాగులో కిలోమీటర్‌ మేర కూర్చున్నారు. వారి తలల మీదుగా ఉద్దాల ఊరేగింపు ముందుకు సాగింది. అనంతరం ఊరేగింపు తిర్మలాపూర్‌ గ్రామం, దేవుని చెరువుట్టల మీదుగా సాయంత్రం ఆరు గంటల సమయంలో కురుమూర్తి జాతర మైదానంలోని దశమికట్టకు చేరుకున్నది. దీంతో ఒక్క సారిగా గోవింద నామ స్మరణ మిన్నంటింది. నెమలి కట్టలను చేతిలో పట్టుకొని, బంతిపూల మాలలు వేసుకున్న భక్తులు ఉద్దాలను తాకేందుకు పరుగులు తీశారు. మహిళలు పూనకాలతో స్వామి నామాన్ని స్మరిస్తూ ఊగిపోయారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఆ తర్వాత ఉద్దాలను ట్రాక్టర్‌పై ఉంచి ఊరేగింపును కొనసాగించారు. రాత్రి ఏడు గంటల సమయంలో స్వామి వారి రాజగోపుర ముఖద్వారానికి చేరుకున్నారు. అక్కడ ప్రదక్షణలు చేయించారు. అనంతరం ఉద్దాలను గుట్టమీదకు తీసుకువెళ్ళి పూజలు చేసి మండపంలో ఉంచారు. వచ్చే బ్రహ్మోత్సవాల వరకు ఉద్దాలనే అక్కడే ఉంచుతారు.

భారీ బందోబస్తు

ఉద్దాలోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆరు వందల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముగ్గురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 42 మంది ఎస్‌ఐలు, వంద మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 239 మంది పోలీసులు, 79 మంది మహిళా పోలీసులు, 121 మంది హోంగార్డులు బందోబస్తులో పాల్గొన్నారు. జాతర మైదా నంలో వంద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అలాగే భక్తు ల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించింది. దాదాపు మూడు లక్షల మంది భక్తులు ఉత్సవానికి తరలివచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - Nov 08 , 2024 | 11:52 PM