ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చేనేత పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Dec 07 , 2024 | 11:20 PM

చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు కోరారు.

చెక్కును అందజేస్తున్న రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌. మోహన్‌ రావు

- రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు కోరారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాపాల విజయోత్సవాల్లో భాగంగా ఆయన చేనేత కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ.. వ్యవసాయం తర్వాత చేనేత రంగంలో జీవనోపాధి పొందుతున్న చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారన్నారు. వస్త్రాల తయారీలో వస్తున్న అధునాతన సాంకేతిక మార్పుల కారణంగా చేనేత రంగంలో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, నూతన డిజైన్లు, వైవిద్యతతో వస్త్రాల తయారీలో ముందుకెళ్లాలని పలు సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్నకు చేయూత ద్వారా చేనేత కార్మికుడు పొదుపు చేసుకున్న డబ్బుకు రెండింతలు ప్రభుత్వం వాటాగా వారి అకౌంట్లో జమచేస్తోందన్నారు. నేతన్న బీమా ద్వారా చనిపోయిన కార్మికుడి కుటుంబ సభ్యులకు రూ.ఐదు లక్షల బీమా చెల్లుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నేతన్నకు చేయూత ద్వారా రూ.2,15,59,000 చెక్కు అందజేశారు. అంతకుముందు చేనేత కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి జరిగిందో వివరించారు. అనంతరం చేనేత కార్మికులను అదనపు కలెక్టర్‌ శాలువాతో ఘనంగా సన్మానించారు. చేనేత, జౌళిశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నాగలత, సహాయ సంచాలకులు బాబు, భిక్షప్ప, అభివృద్ధి అధికారి రాజేష్‌బాబు, సహాయ అభివృద్ధి అధికారులు లావణ్య, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 11:20 PM