ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అనర్హులు డబుల్‌ ఇళ్లను స్వచ్ఛందంగా అప్పగించాలి

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:14 PM

ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యో గులు, ఉన్నతశ్రేణి వర్గాలు డబుల్‌ బెడ్రూం ఇల్లు పొందితే స్వచ్ఛందంగా అప్పగించాలని రెవె న్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నా రు.

- అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యో గులు, ఉన్నతశ్రేణి వర్గాలు డబుల్‌ బెడ్రూం ఇల్లు పొందితే స్వచ్ఛందంగా అప్పగించాలని రెవె న్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు అన్నా రు. లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించా రు. ప్రభుత్వం పేదలకు కేటాయించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను లబ్ధిదారులు వేరొకరికి అమ్మి నా, కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటామ న్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో అక్ర మాలపై మునిసిపాలిటీ దివిటిపల్లిలో రెవెన్యూ అధికారులు బుధవారం ఇంటింటి సమగ్ర సర్వే చేపట్టి విచారణ నిర్వహించారు. అదనపు కలెక్ట ర్‌, గృహనిర్మాణ పీడీ వైద్యం భాస్కర్‌ పర్యవేక్షించారు.

యజమానురాలికి ఇల్లు అప్పగింత

దివిటిపల్లిలో షాహిదాబేగం అనే మహిళకు డబుల్‌ బెడ్రూం ఇల్లు కేటాయించారు. ఆమె కొ డుకు మానసిక దివ్యాంగుడు కావడంతో చికి త్స కోసం ఆమె స్థానికంగా అందుబాటులో లేక పో వడంతో ఇంటితాళం పగులగొట్టి ఓ కుటుం బం నకిలీ పత్రాలతో ఆ ఇంట్లో ఉంటున్నారు. ఈవిష యంపై షాహిదాబేగం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పరిశీలించగా తహసిల్దారు కార్యాలయం ఆన్‌లైన్‌లో షాహిదాబేగం పేరు ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెకు అప్పగించారు. ఇంటి స్థలం పట్టా సర్టిఫికెట్‌ను అందజేశారు.

Updated Date - Oct 23 , 2024 | 11:14 PM